బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 31, 2020 , 06:40:21

దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి..

దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి..

 హైదరాబాద్ : దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి  బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగిలించారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్టేషన్‌  పరిధి లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.... బోడుప్పల్‌ ఆర్‌ఎన్‌ఎస్‌ కాలనీలో నివా సం ఉంటున్న మద్దూరి రాజేశ్వర సోమయాజులు  ప్రైవేటు ఉద్యోగి.  కాగా.. ఈ నెల 20న కుటుంబ సభ్యులతో కలసి విజయవాడకు దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి గురువారం సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న సుమారు రూ. 5లక్షల విలువైన 14 తులాల బంగారు ఆభరణాలతో పాటు 5తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.logo
>>>>>>