గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 31, 2020 , 06:47:04

క్యాబ్‌ డ్రైవర్‌ 9 నెలల తర్వాత దొరికాడు...

క్యాబ్‌ డ్రైవర్‌ 9 నెలల తర్వాత దొరికాడు...

కాచిగూడ : కుటుంబ సమస్యలతో అదృశ్యమైన క్యాబ్‌  డ్రైవర్‌ కేసును..  కాచిగూడ పోలీసులు ఛేదించారు. ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌ కథనం ప్రకారం... పంజాగుట్టలోని జయ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే అలీ మెసూన్‌భక్షి(28)  క్యాబ్‌ డ్రైవర్‌. 2019 ఏప్రిల్‌ నెల 18న కాచిగూడలోని మహారాజా హోటల్‌లో భార్యకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ఉండడంతో  దింపి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన  భార్య, కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో మే 14న కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య భారతి ఫిర్యాదు మేరకు  పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి.. 9 నెలల పాటు గాలించి.. గురువారం అలీ మెసూన్‌భక్షిని అత్తాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకువచ్చి  కుటుంబ సభ్యులకు అప్పగించారు. 


logo