బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 03, 2020 , 13:17:19

కారులోనుంచి దిగుతుంటే..

కారులోనుంచి దిగుతుంటే..

హైదరాబాద్ : స్నేహితుడికి ఇవ్వడానికి తీసుకువచ్చిన డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. డీఐ యాదేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌ చంద్‌ కుమారుడు మనోజ్‌కుమార్‌ చంద్‌(40) బేగంబజార్‌లో ఉండే స్నేహితుడు శివకుమార్‌కు రూ.లక్ష ఇవ్వడానికి  గురువారం కాచిగూడలోని శ్యామ్‌బాబా మందిర్‌ వద్దకు వచ్చాడు. కారుడోర్‌ తీసి కిందికి దిగుతుండగా... అంతలోనే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆతని చేతిలో ఉన్న బ్యాగును ఎత్తుకుని పారిపోయారు. వెంటనే బాధితుడు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  దుండగులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు డీఐ తెలిపారు. పాత దొంగలు అయిఉండవచ్చనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.


logo