సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 31, 2020 , 07:05:52

నకిలీ టీషర్టులు విక్రయం..నలుగురు అరెస్ట్

నకిలీ టీషర్టులు విక్రయం..నలుగురు అరెస్ట్

హైదరాబాద్ :  ప్రముఖ సంస్థకు చెందిన నకిలీ టీషర్టులు విక్రయిస్తున్న నలుగురు వ్యాపారులను సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ లింగారెడ్డి  కథనం ప్రకారం.. బెంగుళూరుకు చెందిన అట్టిట్యూడ్‌ సంస్థ పేరుపై  నకిలీ టీషర్టులను విక్రయిస్తున్నారనే సమాచా రంతో సదరు సంస్థ ఉపాధ్యక్షుడు ఎంఎస్‌ తేజస్వి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాకత్‌ పురాకు చెందిన మహ్మద్‌ మొహినుద్దీన్‌ (50), ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్‌ తాహెర్‌ (38), సరూర్‌నగర్‌కు చెందిన ఆర్‌. సురేష్‌ (57), మహ్మద్‌ రహీం (32)లు అట్టిట్యూడ్‌ కంపెనీ పేరుతో  కోఠి పరిసర ప్రాంతాల్లో నకిలీవి విక్రయిస్తున్నారు.  ఈ నలుగురు తమిళనాడుతోని సేలంలో తక్కువ ధరకు తీసు కువచ్చి కోఠి ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ప్రముఖ సంస్థ ఉపాధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యాపారులను అరెస్ట్‌ చేసి , వారి వద్ద ఉన్న రూ.90వేల విలువ గల టీషర్టులను స్వాధీనం చేసుకున్నారు. 


logo