సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 08, 2020 , 01:13:07

గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరి

గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరి
  • జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి విజయ్‌కుమార్‌రెడ్డి

యాచారం: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి విజయ్‌కుమార్‌రెడ్డి కోరారు. మండలంలోని ధర్మన్నగూడ గ్రామంలో పశుసంవర్ధకశాఖ అధ్వర్యంలో శుక్రవారం పశు వైద్యశిబిరాన్ని నిర్వహించి, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధకశాఖ ఏడీఏ వసంతకుమారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆమె సూచించారు.

ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధికి నివారణకు పశువులకు టీకాలు వేయడంతో పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటుగా పాల దిగుబడి అధికంగా పెరుగుతుందన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పశువులు అనారోగ్యాన్ని గురైతే వెంటనే పశువైద్యశాలను ఆశ్రయించి సరైన చికిత్సలను అందించాలని కోరారు. పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి వైద్యుల సలహాలు, సూచనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ ఏడీ వసంతకుమారి, మండల పశువైద్యాధికారి వనజాకుమారి, సర్పంచ్‌ బాషయ్య, ఉపసర్పంచ్‌ పాండుచారి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌ఠాకూర్‌, రైతులు పాల్గొన్నారు.


logo