బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:26:55

సాక్ష్యం చెదిరిపోకుండా..మాక్ ట్రయల్

సాక్ష్యం చెదిరిపోకుండా..మాక్ ట్రయల్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళ జోలికి వస్తే వదిలి పెట్టేది లేదని తాజా హాజిపూర్ శ్రీనివాస్ రెడ్డికి పడ్డ ఉరి శిక్ష కామాంధులకు ఓ హెచ్చరికగా నిలిచింది. రాచకొండ పోలీసులు చేసిన సమగ్ర, సమర్ధవంతమైన దర్యాప్తులో ఏ కోణంలో కూడా నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా చేశారు. శ్రీనివాస్‌రెడ్డి చేసిన కిరాతకాన్ని టెన్నాలజీ, శాస్త్రీయం, ఫోరెన్సిక్, డాక్యుమెంటేషన్‌లో ఎక్కడ కూడా ఓ చిన్న లోపం లేకుండా పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నుంచి కానిస్టెబుల్ ఆఫీసర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కృషి చేశారు.9 నెలల మూడు హత్య, లైంగిక దాడి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిరూపించారు.అంతేకాకుండా 101 మంది సాక్ష్యులను విచారించి వారిక భద్రత పరంగా భరోసాను ఇచ్చారు.శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారు కావడంతో దీనికి కృషి చేసిన రాచకొండ పోలీసులను బాధితుల కుటుంబాలు అభినందించాయి. వారు కన్నీరు పెట్టడంతో సీపీ వారిని ఓదార్చారు.

సాక్ష్యుల్లో ఆందోళన తొలగించారు...

ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ సాక్ష్యు గందరగోళం నివారించేందుకు ప్రత్యేకంగా మాక్ ట్రయల్‌ను నిర్వహించారు. దీని కోసం కోర్టు విచారణ సమయంలో ఉండే వాతావరణాన్ని  వారికి చూపించారు.ఎక్కడ కూడా సాక్ష్యులు వారి చూసింది మర్చిపోకుండా ఉండేందుకు వారిలో మానసిక ఆందోళన, భయాన్ని తొలగించి వారిలో ధైర్యం నింపారు. దీంతో 101 సాక్ష్యులు ఎక్కడ కూడా కలవరానికి గురికాకుండా వారు చూసింది చెప్పడంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి ఖాయమైంది. సమర్ధవంతంగా, ప్రక్రీయ ప్రకారంగా  చేసిన దర్యాప్తు ,విచారణలో  ఫోరెన్సిక్, రెవెన్యూ, వైద్య, క్లూస్‌టీమ్, రాచకొండ ఐటీ సెల్, మృతి చెందిన విద్యార్ధుల స్కూల్ యాజమాన్యానికి, సెల్‌ఫోన్ సర్వీసు ప్రొవైడర్, డైరక్టర్ ఆఫ్ పాసిక్యూషన్, కోర్టు సిబ్బంది, అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇలా ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయడం నిందితుడికి చట్టపరంగా పడాల్సిన శిక్ష ఖరారైంది. ఈ విచారణ సందర్భంలో బాధితులకు అండగా నిలబడ్డ రాచకొండ పోలీసులు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని కూడా వచ్చేలా చేశారు.ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ 3 కేసుల్లో పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు.



logo
>>>>>>