మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:21:15

అక్రమ నల్లా కనెక్షన్ తొలిగింపు

అక్రమ నల్లా కనెక్షన్ తొలిగింపు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి సరఫరా చేస్తున్న పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన వ్యక్తిపై విజిలెన్స్ విభాగం అధికారులు కేసు నమోదు చేశారు. జియాగూడ సెక్షన్ పరిధిలోని ముస్తక్‌పురా ఇంటి నంబరు 13-3-26కు అధికారుల అనుమతి లేకుండా సంబంధిత భవన యజమాని 20ఎంఎం (కమర్షియల్ కేటగిరి)నల్లా కనెక్షన్ అక్రమంగా తీసుకున్నట్లు విజిలెన్స్ బృందం గుర్తించింది. ఎండీ దానకిశోర్ ఆదేశాల మేరకు అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో సంబంధిత భవన యజమాని ఎం.మోహినుద్దీన్‌పై కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌లో యూ/ఎస్ 269, 430, 370 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. జలమండలి అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమిస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నా వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి 99899 98100, 9989992268 నంబర్లకు సమాచారం అందించాలన్నారు. 


logo
>>>>>>