బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:20:42

మాజీ సైనికుల కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశం

మాజీ సైనికుల కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఆసక్తిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సైనిక సంక్షేమశాఖ సంచాలకులు కల్నల్ పి.రమేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, చెన్నైలలోని ల్యాంకోహిల్స్, సదర్‌ల్యాండ్ కంపెనీల్లో మాజీ సైనికుల భార్యలు, పిల్లలకు కన్సల్టెంట్ ఉద్యోగాలను కల్పించనున్నారు. అభ్యర్థులు ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి 0-2 ఏండ్ల అనుభవం ఉండాలని, ఎంపికైన వారు డేటా ఎంట్రీ అండ్ రీవర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు, ఎంఎస్ ఆఫీస్, ఆంగ్లభాషలో ప్రావీణ్యం, ఆంగ్లంలో మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలన్నారు. నిమిషానికి 30 పదాలు టైపింగ్ సామర్థ్యం ఉండాలని, ఇతరులతో పోటీపడే తత్వం ఉండాలన్నారు. ఆసక్తిగల వారు [email protected], [email protected] మెయిల్‌కు తమ వివరాలను ఈనెల 10వ తేదీలోగా పంపాలని సూచించారు.


logo