గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:20:16

మెట్రో కారిడార్-2 ప్రారంభోత్సవం సందర్భంగా.. ట్రాఫిక్ మళ్లింపులు

మెట్రో కారిడార్-2 ప్రారంభోత్సవం సందర్భంగా.. ట్రాఫిక్ మళ్లింపులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మెట్రో కారిడార్-2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపును విధించారు. ఈ ఆంక్షలు సాయంత్రం 3 నుంచి 5.30 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. సంగీత్, సెయిట్‌జాన్ రోటరీ నుంచి వచ్చే వాహనాలను వైఎంసీ జంక్షన్ వద్ద నిలిపేసి వాటిని ఎస్‌బీఐ నుంచి  స్వీకార్, ఉప్‌కార్, టివోలి మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ క్లబ్, జేబీఎస్ పికెట్, టివోలి జంక్షన్ మీదుగా వచ్చే వాహనాలను ఎస్‌బీఐ జంక్షన్, వైఎంసీఏ ఎడమకు మళ్లిస్తారు. మారేడ్‌పల్లి, వెస్ట్ మారేడ్‌పల్లి నుంచి వచ్చే వాహనదారులను సర్‌వాసుకీ కాలనీ టీజంక్షన్ నుంచి ఉత్తర మండలం జీహెచ్‌ఎంసీ కార్యాలయం, కోర్టు వీధి, సెయింట్ రోటరీ వైపు పంపిస్తారు. ఈ మళ్లింపులు, ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ఈ సమయాల్లో తమ ప్రయాణాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా ప్లాన్ చేసుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అదనపు సీపీ కోరారు. 


logo
>>>>>>