గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 07, 2020 , 01:17:32

కరోనాపై ఆందోళన చెందవద్దు

 కరోనాపై ఆందోళన చెందవద్దు

అంబర్‌పేట, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని ఫీవర్ దవాఖాన ఆర్‌ఎంవో డాక్టర్ పద్మజ అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు చేపట్టిందని ఆమె తెలిపారు. గురువారం నల్లకుంట ఫీవర్ దవాఖానలో తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఆమె హాజరై కరోనా ప్రివెంటివ్ హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైనా దేశం నుంచి వచ్చిన వారికి ఎవరికైనా ముక్కుకారడం, ముక్కుదిబ్బడ, తలనొప్పి, దగ్గు, గొంతు గరగర, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫీవర్ దవాఖానకు గానీ, గాంధీ దవాఖానకు గానీ వెళ్లి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా నివారణ కోసం హోమియో మందులు బాగా పని చేస్తాయని తెలిపారు. ఈ మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్ రేణుక, ఆయుష్ ప్రతినిధి పరంజ్యోతి పాల్గొన్నారు.


logo