శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 05, 2020 , 02:04:50

పసివాడిని 50వేలకు అమ్మబోయారు

పసివాడిని 50వేలకు అమ్మబోయారు

వెంగళరావునగర్‌: పసి పిల్లాడిని రూ.50 వేలకు విక్రయిం చేందుకు యత్నిస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని ఎస్సార్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని రక్షించి యూసూఫ్‌ గూడలోని శిశువిహార్‌కు తరలించారు. ఎస్సై భాస్కర్‌రావు కథనం మేరకు....బోరబండ సమీపంలోని రామారావు నగర్‌కు చెందిన దివ్యాంగుడైన పరుశురాం భిక్షాటన చేస్తుం టాడు. ఇతనికి పరచయిస్తుడైన కాచిగూడకు చెందిన రవి ద్వారా ఏడాది వయసున్న బాలుడిని కృష్ణ అనే వ్యక్తికి ఎస్సార్‌ నగర్‌లోని అల్మాస్‌ హటల్‌ వద్ద విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిందితు లను అరెస్టు చేశారు. కాచిగూడకు చెందిన కృష్ణకు పిల్లలు లేకపోవడంతో తనకు పరియయస్తుడైన రవితో ఈ విష యాన్ని చెప్పాడు. దీంతో రవి బోరబండకు చెందిన పరు శురాంను సంప్రదించాడు. తన వద్ద బాలుడు ఉన్నాడని రూ.50 వేలు చెల్లించాలని చెప్పి మంగళవారం సాయం త్రం ఎస్సార్‌ నగర్‌ ప్రాంతంలో కలుసుకుందామని చెప్పా డు. కృష్ణ, రవితో పాటు పరశురాం, ఆయన భార్య బాలుడిని తీసుకువచ్చారు. రూ.50వేలకు బేరం కుదిరిన ప్పటికీ రూ.40 వేలు చెల్లిస్తానని కృష్ణ చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. ఈ విక్రయం జరిగే క్రమంలో ఎస్సై భాస్కరరావు, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి చేరు కుని పరుశురాం, రవి, కృష్ణ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోం ఆవరణలో ఉన్న శిశువిహార్‌కు తరలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో బాలుడిని మూసాపేట కూరగాయల మార్కెట్‌ వద్ద నుంచి తీసుకవచ్చారని పరుశురాం చెపుతు న్నాడు. కాగా బాలుడి తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి వాడు, నిందితులు బాలుడిని ఎలా తీసుకువచ్చారనే విష యమై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పట్టుబడిని ముఠా ఇదివరకు ఇంకెవరికైనా పిల్లలను విక్రయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలుడి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఎస్సార్‌ నగర్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. 


logo