గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 05, 2020 , 01:31:55

అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం

అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం

(రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ)  :జిల్లాలో అవినీతి రహిత పాలన, రెవెన్యూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ను కలిసిన విలేకరులతో ముచ్చటించారు. జిల్లా స్థితిగతులపై ఆరా తీశారు. సూర్యాపేట జిల్లాలో ‘ప్రజావాణి’కి భారీగా ఫిర్యాదులు వస్తాయి.. ఇక్కడ చాలా తక్కువగా వస్తున్నాయన్నారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. నూతన కలెక్టరేట్‌ నిర్మాణం.. జిల్లాలో వివిధ శాఖల పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తి కాగానే అన్ని శాఖలు అక్కడికే రానున్నాయన్నారు. ఇంటిగ్రేటేడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలోకి అన్ని శాఖలు వస్తాయన్నారు. సూర్యాపేట జిల్లాలో తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను సైతం రంగారెడ్డి జిల్లాలో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారు. భూముల సర్వే వివరాలను సైతం నూతన కార్యక్రమానికి కలెక్టర్‌ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ-గవర్నెన్స్‌, ఆన్‌లైన్‌ సేవలు, మీసేవా కేంద్రాలు, ప్రజావాణి కార్యక్రమం అధికారులు హాజరుగాక చప్పగా సాగుతున్నదన్న విషయం కలెక్టర్‌ పరిశీలించారు.  స్థలాల పరిరక్షణకు ల్యాండ్‌ బ్యాంక్‌, ఆన్‌లైన్‌ మానిటరింగ్‌లపై కలెక్టర్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇక స్వీకరించిన పిటిషన్లలో చాలా వరకు అపరిష్కృతంగానే ఉంటున్నాయని గుర్తించారు.  


logo