శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 05, 2020 , 01:25:58

ఎన్నికలను ఎప్పుడూ అంచనా వేయలేం

ఎన్నికలను ఎప్పుడూ అంచనా వేయలేం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎన్నికలను ఎప్పుడూ అంచనా వేయలేమనే విషయాన్ని తాను తన ఇరవై ఏండ్ల జర్నలిజంలో నేర్చుకున్నానని ప్రముఖ భారతీయ టెలివిజన్‌ జర్నలిస్ట్‌, రచయిత, కాలమిస్ట్‌ బర్ఖా దత్‌ అన్నారు. సుపరిచితులైన టీవీ జర్నలిస్టు బర్ఖా దత్తా ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు-హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ‘మీడియా - మారుతున్న స్వభావం’ అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా బర్ఖా పలు విషయాలపై తన మనోభావాలను మీడియాతో, ఫిక్కీ సభ్యులతోనూ పంచుకున్నారు. దేశంలో ఎన్నికలు అనే అంశంపై ఒకరు అడిగిన ప్రశ్నకు గాను బర్ఖా స్పందిస్తూ..‘జర్నలిజంలో 20ఏండ్ల అనుభవంలో ఎన్నికలను ఏనాడు అంచనా వేయలేమని అనే ప్రధాన అంశాన్ని తాను నేర్చుకున్నానని’ తెలిపారు.కార్యక్రమంలో ఫీక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌పర్సన్‌ సోనా చట్వాని, యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ పాల్గొన్నారు. logo