శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 03, 2020 , 04:33:09

క్యాన్సర్‌పై అవగాహనకు ‘వాక్‌ ఆఫ్‌ లైఫ్‌'...

క్యాన్సర్‌పై అవగాహనకు  ‘వాక్‌ ఆఫ్‌ లైఫ్‌'...

మాదాపూర్‌: ర్యాంప్‌ పై క్యాట్‌ వాక్‌ చేస్తు మోడల్స్‌ తమ అందాలతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో క్యూర్‌ ఫౌండేషన్‌, అపోలో క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో వాక్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, సినీనటి రాశికన్నా, ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌, చీఫ్‌ నేషనల్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి, మాళవిక శర్మలు హాజరై నిర్వాహకుడు విజయానంద్‌రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లా కపటం తెలియని పసి హృదయాలకు ప్రాణాంతక వ్యాధి సోకితే తల్లిదం డ్రులు తల్లడిల్లిపోతారని, పిల్లల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసు కోవాలని సూచించారు.


 పిల్లలకు సోకిన వ్యాధిని నయం చేసేందుకు ఉత్తమ వైద్య సేవలను అందిం చేందుకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కొంత మంది తల్లిదండ్రులకు అంత స్థోమత ఉండదు కాబట్టి అటువంటి వారికి సేవ చేసేందుకై ఏర్పాటు చేసిన క్యూర్‌ ఫౌండేషన్‌, అపోలో హస్పిటల్‌ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్యాన్సర్‌ క్రూసెడర్స్‌ కప్‌ను గత 12 ఏండ్లుగా నిర్వహిస్తు క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తు నిధుల సమీకరణకు క్షేత్ర స్థాయిలో కృషి చేస్తున్న క్యూర్‌ ఫౌండేషన్‌కు అన్ని విధాల మద్దతు లభించడం విశేషమన్నారు. అనంతరం క్యూర్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు విజయానంద్‌రెడ్డి మాట్లాడుతూ సమాజం యొక్క ప్రయోజనం కొరకే క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు, ఈ ఫౌండేషన్‌ ద్వారా 13 వందల మంది నిరుపేదల పిల్లలకు క్యాన్సర్‌ వ్యాధిని సులభతరం చేసినట్లు తెలిపారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా అనేక పునరావాస, పరిశోదన, విద్యా కార్యక్ర మాలను చేపడుతున్నట్లు తెలిపారు.  అపోలో హస్పిటల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   


logo