శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 03, 2020 , 04:28:46

సెలవొస్తే సైబర్‌ నేరగాళ్లకు పండుగే..!

సెలవొస్తే సైబర్‌ నేరగాళ్లకు పండుగే..!
  • అదే రోజు ఎక్కువ మందిపై పంజా
  • వివరాలు తెలుసుకోవడం కష్టం
  • అప్రమత్తతోనే సైబర్‌నేరాలకు అడ్డుకట్ట

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సెలవు రోజు వచ్చిందంటే సైబర్‌నేరగాళ్లు అమాయకులపై పంజావిసురుతూ పండుగ చేసుకుంటున్నారు. ఆ రోజు బ్యాంకులు పనిచేయకపోవడంతో నేరగాళ్లకు సమయం కలిసి వస్తుంది. దీంతో పనిదినాలలో జరిగే నేరాల కంటే సెలవు రోజు జరిగే సైబర్‌నేరా లు ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు సైబర్‌ నేరాల బారిన పడ్డ పదుల సంఖ్యలోని ప్రజలు సైబర్‌క్రైమ్‌ ఠాణాను ఆశ్రయిస్తున్నారు. వీరిలో సోమవారం ఎక్కువ మంది ఉంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అదే రోజు ఎక్కువ  మంది మోసపోతున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించా రు. ఒక రోజు సెలవు వచ్చిందంటే.. ఆ మరుసటి రోజు సైబర్‌ఠాణాకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య భారీగానే ఉంటుంది. సోమవారం వచ్చే వరకు భారీగా సైబర్‌ఠాణాను ఆశ్రయించే బాధితులు కన్పిస్తుంటారు. 


సెలవు కలిసొస్తోంది..

 తాము బ్యాంకు అధికారులమం టూ..ఓఎల్‌ఎక్స్‌లో వస్తువు క్రయ విక్రయా లకు పెట్టి.. క్యూఆర్‌ కోడ్‌తో తికమక పెడుతూ డబ్బులు లాగేయ డం తదితర నేరాలు జరుగుతున్నా యి.ఎవరైనా ఆదివారం బ్యాంకు లు ఎక్కడ పనిచేస్తుం టాయని ప్రశ్నిస్తే.. డెబిట్‌ కార్డులన్నింటిని క్రమబద్దీకరిస్తున్నాం. ఈనెలలో చాలా కార్డుల గడువు పూర్తికావడం, చాలామంది ఆధార్‌కు లింక్‌ చేసుకోకపోవడంతో ప్రత్యేకంగా సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సి వస్తుంటూ నమ్మిస్తున్నారు. వారి మాటలు నమ్మి.. ఖాతా, ఏటీఎం వివరాలతో పాటు ఓటీపీ కూడా చెప్పేస్తున్నారు. వీటితో బాధితుల బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బును సైబర్‌నేరగాళ్లు కాజేస్తున్నారు. అయితే డబ్బు తమ ఖాతాలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డ్రా చేశారనే సమాచారం సెల్‌ఫోన్‌ ద్వారా తెలుసుకునే బాధితులు మొదటగా బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తారు. దాంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్తారు. పోలీసులు కూడా బ్యాంకు నుంచే సమాచారం తెప్పించుకోవాల్సి వస్తుంది. 


కార్డు వివరాలు అడుగరు...

సెలవురోజులతో పాటు పనిదినాల్లోనూ బ్యాంకు సిబ్బంది ఎప్పుడైనా ఎవరికి ఫోన్‌ చేసినా డెబిట్‌కార్డు వివరాలు అడుగరు, ఓటీపీ అనేది రహస్యంగా ఉండాల్సింది, దీన్ని ఏ బ్యాంకు అధికారులు సిబ్బంది కూడా అడుగరు. సెలవు రోజుల్లో బ్యాంకు సిబ్బంది ఎవరు కూడా ఖాతాదారులకు ఫోన్‌ చేయరు.ఆదివారం  కాకుండా, ఇతర సెలవు రోజుల్లోనూ సైబర్‌నేరగాళ్లు ఫోన్లు చేస్తూ మోసాలు చేస్తుంటారు. 


logo