శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 03, 2020 , 04:24:05

పాతకక్షల నేపథ్యంలో దారుణహత్య

 పాతకక్షల నేపథ్యంలో దారుణహత్య

చార్మినార్‌, ఫిబ్రవరి 2 :  పాతకక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ను హతమార్చిన ఘటన కామాటిపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉస్మాన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌ (32) స్థానికంగా నివసిస్తూ పత్తేదర్వాజా ప్రాంతంలో స్క్రాప్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌తోపాటు కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోను హత్యాయత్నం కేసుల్లో ప్రధాన నిందితుడు. శనివారం యథావిధిగా  నిర్వహిస్తున్న స్క్రాప్‌ వ్యాపారాన్ని  ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇమ్రాన్‌ కోసం కొంతమంది గుర్తు తెలియని దుండగులు దూద్‌బౌలి గాంధీ విగ్రహం వద్ద వేచిఉన్నారు. సయ్యద్‌ ఇమ్రాన్‌ గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే మూకుమ్మడిగా సయ్యద్‌ ఇమ్రాన్‌పై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రరక్తస్రావంతో ఇమ్రాన్‌ సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు.  స్థానికుల ద్వార విషయం తెలుసుకున్న పోలీసులు  ఆధారాలు సేకరించడానికి ప్రయత్నించారు. పాతకక్షలే ఇమ్రాన్‌ను హతమార్చడానికి పురిగొలిపి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇమ్రాన్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మృతుని సోదరుడు సికిందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశామని ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపారు.


logo