శివుడికి ప్రీతికరమైన నాగలింగం పూలు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ ఆవరణలో పూశాయి. గార్డెన్లో మూడు నాగలింగం చెట్లు ఉండగా, రెండింటికి పూలు పూస్తున్నాయి. కొమ్మలకు కాకుండా చెట్టు మొదలుకు పూయడం వీటి ప్రత్యేకత. ఈ పూలు శివలింగానికి నాగపడగతో నీడ పట్టిన ఆకారం లో ఉంటాయి. శివరాత్రి సందర్భంగా ఈ పూలు పూయడం విశేషం. వీటి తో శివుడిని ఆరాధిస్తే బిల్వ, మారేడు పత్రాలతో పూజ చేసినంత ప్రతిఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. – వెంకటాపూర్