మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Feb 01, 2020 , 04:44:38

నెలాఖరుకుదుర్గం వారథి

నెలాఖరుకుదుర్గం వారథి
  • ఫిబ్రవరి చివరినాటికి పూర్తి
  • వడివడిగా తీగల వంతెన పనులు

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: దుర్గంచెరువుపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తీగల వంతెన నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. మొత్తం 53 సెగ్మెంట్ల బిగింపు పూర్తయింది. ఇరువైపులా రెయిలింగ్‌, రోడ్డు నిర్మా ణం, లైటింగ్‌ తదితర పనులు చేపట్టారు. ఇవన్నీ ఫిబ్రవరి ఆఖరుకు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇది అందుబా టులోకి వస్తే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ అనుసంధాన మార్గంగా ఉపయోగపడనుంది.  రూ.184 కోట్లతో ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో ఈ వంతెనను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రికార్డుస్థాయిలో 22 నెలల్లో వంతెన నిర్మాణం పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచపు అతి పొడవైన(స్పాన్‌) ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ బ్రిడ్జి ప్రాజెక్టుగా దుర్గం వారధిని అభివర్ణిస్తున్నారు. ఈ వంతెనకు అనుబంధంగా జూబ్లీహిల్స్‌నుంచి మరో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. భూసేకరణ సమస్య కారణంగా ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు కొంత ఆల స్యమైనప్పటికీ ఇటీవలే ఆ అడ్డంకులు తొలగిపోవడంతో పనులు ఊపందుకున్నాయి. logo
>>>>>>