బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Feb 01, 2020 , 04:40:04

తుప్పు పట్టి..తుక్కైపోయి

తుప్పు పట్టి..తుక్కైపోయి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పోలీస్‌స్టేషన్లలో వాహనాలు పేరుకుపోతున్నాయి. పట్టుకున్న వాహనాలకు వేలంవేస్తున్నా.. ఆరునెలలు తిరిగేసరికి పోలీస్‌స్టేషన్‌ ఆవరణ అంతా నిండుకుంటుంది. పోలీస్‌స్టేషన్లలో వాహనాల పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో వీటిని ట్రై పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని ఉండే ఆర్మూడ్‌ రిజర్వుకేంద్రాలు, శిక్షణ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉండే ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ చేస్తున్నారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడడం, వివిధ సందర్భాల్లో పోలీసులు స్వాధీనం చేసుకునే వాహనాలను, తిరిగి ఆయా వాహనాల యజమానులు పోలీస్‌స్టేషన్ల నుంచి తీసుకోకపోవడంతో అలాంటి వాహనాలను నిబంధనల ప్రకారం వేలంలో విక్రయిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 10 సార్లు బహిరంగవేలం వేసి 13,379 వాహనాలను విక్రయించారు. అయినా కూడా ఇంకా వాహనాలు పోలీస్‌స్టేషన్ల ఆవరణలో కుప్పలుగా పడి ఉన్నాయి. వాహనదారులు తమ వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఆరునెలల నుంచి సంవత్సరంలో అలాంటి వాహనాలను ఎలాగైనా ఆయా యజమాన్యాలకు చేరవేయడం లేదంటే వేలంలో విక్రయించేందుకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో నిరంతరం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. పోలీసులు వాటిని యజమాన్యాలకు అందించాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తు న్నా చాలావరకు వాహనాలను తీసుకోవడానికి ఆయ యజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వాహనాలను తీసుకోవడానికి పలువురు ముందుకు రావడం లేదని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2019లో  2,520 వాహనాలను వేలం వేశారు. అందులో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాల్లో 1900 కేవలం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులకు సంబంధించినవే ఉం డడం గమనార్హం. 


వేలం ప్రక్రియ ఇలా.. 

పోలీస్‌స్టేషన్ల ఆవరణలో పేరుకుపోయిన వాహనాలను ఆయా కమిషనరేట్ల పరిధిలోని పార్కింగ్‌ స్థలాలకు తరలిస్తారు. ప్రతినెలా వాహనాల వివరాలను అధికారులు సేకరిస్తారు. నోటీసులు జారీచేసినా స్పందించని వాహనాలను బహరంగవేలం వేయాలని ఆయా పోలీస్‌ కమిషనర్లు నిర్ణయించిన తర్వాత ప్రకటన జారీ చేస్తారు. అందులో మేము వాహనాలను వేలం వేయాలనుకుంటున్నాం, సంబంధిత వాహనాల యజమానులు ఎవరైనా ఉంటే పత్రాలు చూ పించి ఆరునెలల్లో స్వాధీనం చేసుకోవాలని సూచన కూడా చేస్తారు. వేలం వేయాలనుకునే వాహనాలను ఆర్టీఏ విభాగం అధికారులతో తనిఖీ చేయిస్తారు, వా టి ఫిట్‌నెస్‌, వాటి విలువ ఎంత ఉంటుంది, వాహనం రోడ్డుపై నడిపేందుకు అవాకాశముందా?, స్క్రాప్‌కు వేయాలా? అనే నివేదికను సంబంధింత అధికారులకు అందిస్తారు. అదేసమయంలో హైదరాబాద్‌ కార్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నేతృత్వంలో https: // hydera badpoli ce.gov.in/ వెబ్‌సైట్‌లో సర్వీసెస్‌లో ఆన్‌క్లెమ్డ్‌ వెహికల్స్‌లో వివరాలను పొందుపరుస్తారు. అందులో పూర్తి వివరాలుంటాయి. వాహనదారులు అందులో తనిఖీ చేసుకొని, వా హనం పోలీసుల నుంచి తీసుకోవచ్చు. ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆరు నెలల సమయంలో ఒక పక్క వాహనదారులకు వాటిని చేరవేసేందుకు అవసరమైన ప్రక్రియ చేస్తూనే.. మరోపక్క వేలానికి ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వ అనుమతులు తీసుకుంటారు.  2015 నుంచి బహిరంగ వేలం ప్రకటన హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నారు. తాజాగా గతేడాది డిసెంబర్‌ 31న స్క్రాప్‌ కింద 2295, రోడ్డుపై నడిచే వాహనాలను 225 బహిరంగ వేలంలో విక్రయించారు, రాచకొండ, సైబరాబాద్‌లో 1830 వాహనాల వరకు విక్రయాలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన బహిరంగ వేలంలో మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారుగా జరిగిన వాహనాల విక్రయాలు, వాటితో వచ్చిన ఆదా యం వివరాలు.. 


logo