బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 31, 2020 , 00:35:57

స్నాచర్ల కోసం.. 27 కి.మీ నిఘా

స్నాచర్ల కోసం..  27 కి.మీ నిఘా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాచకొండ పోలీసులు నేరస్తులను వదలడం లేదు. నేరం చేసినట్లు తేలితే.. గాలించి పట్టుకుంటున్నారు. రోజులు గడిచినా.. కిలో మీటర్లు తిరిగినా...దుండగులు ఎన్ని ఎత్తులు వేసి తప్పించుకుంటున్నా .. దొరికే వరకు గాలించి పట్టుకుంటున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల ఓ జంట దొరికిన వైనమే పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌కు నిదర్శనం. మేడిపల్లిలో నెల రోజుల కింద జరిగిన చైన్‌ స్నాచింగ్‌  ఘటనపై రాచకొండ పోలీసులు దాదాపు 27 కిలో మీటర్ల పొడవునా..  దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టి మొదట నిందితులను గుర్తించారు. అలా.. ఆ 100 సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు ఇన్‌ ఫార్మర్‌ల సమాచారంతో ఎట్టకేలకు యువతి, యువకుడిని అరెస్ట్‌ చేసి... స్నాచింగ్‌ వెనకాల ఉన్న నిందితుల మొహన్ని వెలుగులోకి తెచ్చారు. మూడు తులాల గొలుసు కదా అని కేసును పెండింగ్‌లో పెట్టలేదు . నిరంతరం 8 బృందాలు స్నాచర్లను పట్టుకునేందుకే గాలించి పట్టుకున్నాయి.  

  

వివరాల్లోకి వెళ్లితే... మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని కనకదుర్గానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న అసురెడ్డి బాలమణి గత నెల 19న తన కూతురిని బస్‌స్టాప్‌ వద్ద వదిలేసి.. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చింది. బైక్‌ మీద వచ్చి న యువతి,యువకుడు అద్దెకు ఇండ్లు ఉన్నాయా అంటూ పలకరించారు. ఆ తర్వాత మంచినీళ్లు అడిగి ఆమె లోపలికి వెళ్ళగానే ఈ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి బాలమణిపై పెప్పర్‌ స్ప్రే చల్లి మెడలో ఉన్న 3 తులాల బంగారం పుస్తెలతాడును తెంచుకుని పరారయ్యారు. దీంతో బాలమణి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. చైన్‌ స్నాచింగ్‌ అనగానే ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు వెంటనే 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలతో నేర ప్రక్రియ కొత్తగా ఉందని భావించిన పోలీసులు నిందితుల ఎస్కేప్‌ రూటును తయారు చేసుకున్నారు. దీంట్లో భాగంగా మేడిపల్లి, ఉప్పల్‌, నా గోలు, ఎల్బీనగర్‌, తట్టిఅన్నారం, మీదుగా పెద్ద అంబర్‌పేట్‌ వరకు హోండా యాక్టివా వాహనంపై యువతి, యువకుడు వెళ్తున్న దృశ్యాలను సేకరించారు. వాటిలో అనుమానాస్పదంగా అనిపించిన వాటిని వేరు చేశారు.


పెద్ద అంబర్‌పేట్‌ మలుపు...అదే కీలక క్లూ...

27 కిలో మీటర్‌ల దూరం వెళ్లిన ఎరుపు రంగు హోండా యాక్టివాపై ఉన్న యువతి, యువకుడు పెద్ద అంబర్‌పేట్‌ వద్ద మలుపు తీసుకున్నారు. తిరిగి అదే రూటులో ఉప్పల్‌ వరకు చేరుకున్నారు. దీంతో వారి ఫొటోలను స్పష్టపర్చుకుని  ఆ వాహనం నంబర్‌ సే కరించుకున్నారు. అలా వారిని కొన్ని రోజులు అనుసరించారు.అయితే సంఘటన స్థలంలో ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగు, ఈ ఫొటోలకు తోడవడంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా స్నాచర్లు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడ కొంత మం దికి బ్యాగును చూపించి ఈ ప్రాంతంలో ఎవరైనా ఈ తరహ బ్యాగును వాడుతారా అ ని సమాచారం సేకరించారు. స్థానికులు కొంత సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఫొటోలను చూపించడంతో ఆ యువతి ఈ బ్యాగు వాడుతుందని నిర్ధారించారు. అప్పుడు పోలీసులు ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకోగా.. స్నాచింగ్‌ చేసింది వారేనని స్పష్టమైంది. ఎక్కడ కూడా నిందితులకు అనుమానం రాకుండా ..పోలీసులు దాదాపు 30 రోజులు గాలించడంతో మొదటి సారి స్నాచింగ్‌లకు దిగిన బీటెక్‌ విద్యార్థి భానువికాస్‌, అతని ప్రియురాలు పోలీసులకు ఈ నెల 28న దొరికారు. ప్రస్తుతం వీరు జైలు ఉన్నారు.


logo