శనివారం 28 మార్చి 2020
Hyderabad-city - Jan 30, 2020 , 00:36:01

పిల్లల్లో పరిపక్వతకు ‘చిల్డ్రన్‌ లిటరరీ ఫెస్టివల్‌'

పిల్లల్లో పరిపక్వతకు ‘చిల్డ్రన్‌ లిటరరీ ఫెస్టివల్‌'

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి భావితరాలకు కేవళం విద్యను అందించడమే కాకుండా ప్రాథమిక విధులను కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. మనిషి సరైన మార్గంలో నడవాలంటే ముందుగా వారికి కావాల్సింది ఉత్తమ ఆలోచన, ప్రతి విషయంపై అవగాహన. అలాంటి బాలల మెదడును పదును చేసేందుకు, వారిలో అనేక మంచి అలోచనలకు, ఆలోచనా ఙ్ఞానాన్ని పెంపొందించేందుకు, ఇతరులపై వారు నడుచుకోవాల్సిన తీరును, బాలికల సమానత్వాన్ని పెంపొందిస్తూ పరిపక్వంగా తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ప్లాన్‌ ఇండియా సంస్థ తన కార్యక్రమాలతో కృషి చేస్తుంది. ఇందులోభాగంగా దేశంలోని అనేక పాఠశాలల్లో బాలలతో అనేక కార్యక్రమాలు నిర్వహించి వారిలోని నైపుణ్యాలను, వారి అలోచనాశక్తిని తోటి విద్యార్థులతో పంచుకునే అవకాశం కల్పిస్తుంది. అందులోభాగంగానే 2 నెలలుగా దేశవ్యాప్తంగా తెలంగాణతోపాటు 10 రాష్ర్టాల్లోని దాదాపు లక్షమంది పిల్లలు వివిధ దశల్లొ పాల్గొన్న తర్వాత వారి నుంచి 130మంది ప్రత్యేకతలను ప్రదర్శించనున్నారు. 


‘నేషనల్‌ చిల్డ్రన్స్‌ లిటరరీ ఫెస్టివల్‌' పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేడ్చల్‌లోని సీహెచ్‌ఏఐ క్యాంపస్‌ వేదికగా మారింది. కార్యక్రమంలో చిన్నారులతో అనేక విషయాలపై  వర్క్‌షాప్‌ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ఇతర విద్యార్థుల నుంచి అనేక విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే తమకు తెలిసిన అనేక విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల వారితోపాటు కార్యక్రమానికి వచ్చే ఇతర పిల్లలకు కూడా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం గలదు. దీంతో పాటు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెరుగుదలకు ఈ కార్యక్రమం తోడ్పడనుంది. కార్యక్రమంలో 11 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు అధికంగా ఉన్నారు. దీంట్లో పాల్గొనేందుకు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించారు కార్యక్రమ నిర్వాహకులు.


లింగ సమానత్వంపై ప్రత్యేక దృష్టి...

కార్యక్రమంలో ఆడపిల్లలపై గౌరవం, లింగ సమానత్వం వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇందులోభాగంగా పిల్లలకు ఆసక్తికరంగా సమాజం, స్త్రీలపై గౌరవాన్ని పెంపొందించేందుకు, వారి విలువను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతోపాటు ఆడ పిల్లలకు ప్రత్యేక అవకాశాలు కల్పించి వారు దేనిలోనూ తక్కువకాదని నిరూపించుకునే అవకాశం కల్పించారు. 


పుస్తకాలు చదవడం, వాటిని విశ్లేషించడం..

నేటికాలంలో చిన్నారులు కేవలం బడి పుస్తకాలకే పరిమితమైపోయారు. కేవలం పిల్లలే కాదు పెద్దవారు కూడా చాలామం చి పుస్తకాలకు దూరమయ్యారు. దీంతో పిల్లల్లో కేవలం అకాడమిక్‌ ఙ్ఞానం తప్ప సమాజంపై అవగాహన పొందలేక పోతున్నారు. సమాజాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల పిల్లల్లో మానసిక పరిపక్వత రావడం లేదు. దీనికి ముగింపు పలికేలా పిల్ల ల్లో వివిధ రకాల సామాజిక విషయాలను తెలియజేసే పుస్తకాలను చదివేలా ప్రోత్సాహం కల్పించనున్నారు. దీంతోపా టు ఇప్పటికే ఉన్న పుస్తకాలను పిల్లలతో చదివించి అందులో వారికి నచ్చని విషయాలను తిరిగి రాసేలా, పిల్లలే కొత్త పుస్తకాలు రాసేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. అందులోభాగంగా చిన్నారులు స్వయంగా పద్యాలు, కథల పుస్తకాలు కూడా రాయడం మొదలుపెట్టారు. దీంతోపాటు మహిళల గొప్పతనాన్ని తెలిపే అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచారు.


సాంస్కృతిక కార్యక్రమాలు...

చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే అంశాలు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలే. అందుకే వారికి నచ్చే విధంగా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమ కార్యక్రమాలు, పిల్లలచే నాటక ప్రదర్శనఎలు నిర్వహిస్తుంటారు. దీంతో పిల్లల్లో కథ, మాటలు, రచన వంటి అనేక విషయాల్లో నైపుణ్యాలు పెంపొందుతా యి. అలాగే కార్యక్రమానికి వచ్చే విద్యార్థులకు కూడా ఆ నాటకాలతో సామాజిక స్పృహను కల్పిస్తారు చిన్నారులు. వీటితోపాటు చిన్నారులు స్టేజ్‌పై నేరుగా తమ మనసులోని మాటలను, ఆవిష్కరణలను తెలియజేసేలా మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. 


logo