మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Jan 29, 2020 , 03:07:41

నీటి వృథాను అరికట్టాలి

నీటి వృథాను అరికట్టాలి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలో 170 మిలియన్‌ గ్యాలన్లు (77 కోట్ల లీటర్ల) వృథాను అరికట్టడానికి జలమండలి చేపట్టిన వాక్‌ కార్యక్రమం నగర వ్యాప్తంగా చేపట్టనున్నట్లు ఎండీ ఎం.దానకిశోర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎంపిక చేసిన ఎన్జీవో బృందాల ప్రతినిధులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి సరఫరా చేస్తున్న మంచినీరు దాదాపుగా లెక్కకు రాకుండా పోతున్న దాదాపు 40శాతం మంచినీటి వృథాను అరికట్టడానికి జలమండలి రూపొందించిన వాక్‌ ప్రయోగాత్మకంగా సనత్‌నగర్‌లో పూర్తి స్థాయిలో పని చేయడంతో ఆ ప్రాంతాల్లో కొంత మేర నీటి వృథా తగ్గిందని, ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాలు చేపడితే మరింత నీటి వృథాను తగ్గించవచ్చని, ఈ కార్యక్రమాన్ని నగరవ్యాప్తంగా చేపట్టాలని ఎండీ నిర్ణయించారు. 16 ఎన్జీవోలు, 300 మంది ఎన్జీవోల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. 


స్థానిక జలమండలి అధికారులు, లైన్‌మన్లు, వాక్‌ వలంటీర్లు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సీనియర్‌ సిటిజన్స్‌, కాలనీ అసోసియేషన్లతో నీటి వృథా అయ్యే ప్రాంతాలను గుర్తించి రూపొందించిన నమూనాలో వివరాలు సేకరించి ఇంటింటికి బ్రాండింగ్‌ (రంగుల గుర్తుల కేటాయించడం)జరుగుతుందన్నారు. మంచినీరు అధికంగా వృథాగా అవుతున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వీరు మంచినీటి ప్రాముఖ్యతను వివరించి నీటి వృథాను అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం కలిగిస్తారని తెలిపారు. 38 శాతంగా ఉన్న ఎన్‌ఆర్‌డబ్ల్యూను 35శాతానికి తగ్గించడానికి ఆస్కారం ఉందన్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి ఆరు నెలల పాటు కొనసాగుతుందని, వచ్చే వేసవి వరకు కొంతమేర మంచినీటి పొదుపు చేసి పెడితే వేసవిలో నీటి ఇక్కట్లు తగ్గుతాయని ఈ సందర్భంగా ఎండీ తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు పి.రవి, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>