గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 28, 2020 , 03:40:30

మేడ్చల్‌ గడ్డ..టీఆర్‌ఎస్‌ అడ్డ

మేడ్చల్‌ గడ్డ..టీఆర్‌ఎస్‌ అడ్డ
  • - ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌కే ప్రజల మద్దతు
  • - మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో టీఆర్‌ఎస్‌కు 44.50 శాతం ఓట్లు
  • - కాంగ్రెస్‌కు 20.84శాతం, బీజేపీకి 12.75శాతం
  • - బీజేపీకి స్వతంత్ర అభ్యర్థుల కంటే 6.38 శాతం తక్కువ..
  • - కాంగ్రెస్‌కు స్వతంత్ర అభ్యర్థుల కంటే 1.71శాతమే ఎక్కువ
  • - టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌పీ ఇతర పార్టీలకు కలిపి 2.79 శాతమే


మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి :  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ పరిపాలన.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యం.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు కారుకు ఓట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికలేవైనా అందులో వచ్చే ఫలితం మాత్రం ఏకపక్షమే. . అసెంబ్లీ, పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల ఫలితాలే ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యాయి. నాలుగు కార్పొరేషన్లలో, 9 మున్సిపాలిటీలలో పోలైన మొత్తం ఓట్లలో 44.50 శాతం ఓట్లు కారు గర్తుపైనే పడగా, కాంగ్రెస్‌కు కేవలం 20.84శాతం ఓట్లు అంటే టీఆర్‌ఎస్‌కు వచ్చిన వాటిలో సగంకంటే తక్కువ, అలాగే బీజేపీ 12.75 శాతం మాత్రమే వచ్చాయి.  బీజేపీకి స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే 6.38 శాతం తక్కువ రాగా, కాంగ్రెస్‌కు స్వతంత్రుల కంటే 1.71 శాతం ఎక్కువగా వచ్చాయి. 


టీడీపీ అడ్రస్‌ గల్లంతు..

టీడీపీ, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితితో పాటు మరికొన్ని చిన్న చితక పార్టీలకు కలిపి కేవలం 2.79 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయంటే ప్రజలలో ఆ పార్టీల పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ పార్టీ ద్వారా పోటీ చేసిన వారిలో 95శాతం మందికి డిపాజిట్లు రాలేదు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పోటీ చేసిన వారిలోను డిపాజిట్లు రానివారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కాంగ్రెస్‌, బీజేపీ గ్రాఫ్‌ పడిపోతుండగా, టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ మాత్రం రెట్టింపు అవుతుంది. ఇందులో భాగంగా గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అందులో మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపునకు ప్రధాన కారణం కేసీఆర్‌ ప్రభుత్వంపై, కేటీఆర్‌ నాయకత్వంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకమనే చెప్పాలి. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని నాలుగు కార్పొరేషన్లలో, 9 మున్సిపల్‌ కార్పొరేషన్ల వారిగా మొత్తం పోలైన ఓట్లలో పార్టీలవారీగా వచ్చిన ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 

పీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 61,216 ఓట్లుండగా, ఇందులో 38,870 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 17,250 ఓట్లు (44.38శాతం) రాగా, కాంగ్రెస్‌కు 7,152 (18.4 శాతం) ఓట్లు, బీజేపీకి 5,521 (14.2శాతం) ఓట్లు, స్వతంత్రులకు 8,850 (22.77శాతం) ఓట్లు, సీపీఐ, సీపీఎం టీజేఎస్‌, ఇతర పార్టీలకు కలిపి కేవలం 97ఓట్లు (0.25శాతం) ఓట్లు పోలయ్యాయి. బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 73,832 ఓట్లుండగా, ఇందులో 46,783 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 17,798 ఓట్లు (38.04శాతం) రాగా, కాంగ్రెస్‌కు 13,078 (27.95శాతం) ఓట్లు, బీజేపీకి 6,170 (13.19శాతం) ఓట్లు, స్వతంత్రులకు 9,503 (20.31శాతం) ఓట్లు, సీపీఐ, సీపీఎం టీజేఎస్‌, ఇతర పార్టీలకు కలిపి కేవలం 234ఓట్లు (0.5శాతం) వచ్చాయి.


జవహర్‌నగర్‌లో 43 శాతం

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 70,866 ఓట్లుండగా, ఇందులో 34,686 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 14,747 ఓట్లు (42.52శాతం) రాగా, కాంగ్రెస్‌కు 5,994 (17.28శాతం) ఓట్లు, బీజేపీకి 2,894 (8.34శాతం) ఓట్లు, స్వతంత్రులకు 9,121 (26.3శాతం) ఓట్లు, సీపీఐ, సీపీఎం టీజేఎస్‌, ఇతర పార్టీలకు కలిపి కేవలం 1,930 ఓట్లు (5.56శాతం) ఓట్లు పోలయ్యాయి. నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 1,09,962 ఓట్లుండగా, ఇందులో 42,656 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 21,038 ఓట్లు (49.32శాతం) రాగా, కాంగ్రెస్‌కు 1,736 (4.07 శాతం) ఓట్లు, బీజేపీకి 6,213 (14.57శాతం) ఓట్లు, స్వతంత్రులకు 8,329 (19.53 శాతం) ఓట్లు, సీపీఐ, సీపీఎం టీజేఎస్‌, ఇతర పార్టీలకు కలిపి కేవలం 5340 ఓట్లు (12.52 శాతం) మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఈ కార్పొరేషన్‌లో కమ్యూనిస్టు పార్టీలకంటే కూడా కాంగ్రెస్‌ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. 


మున్సిపాలిటీల్లోనూ కారు జోరు..

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో మొత్తం 37,791 ఓట్లుండగా, ఇందులో 22,729 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్‌కు 11,931 (52.49 శాతం ), కాంగ్రెస్‌కు 7,174 (31.56శాతం), బీజేపీకి 2,430 (10.69శాతం), స్వతంత్రులకు 1,011 (4.45శాతం) ఇతరులకు 183 (0.81శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. నాగారంలో మున్సిపాలిటీలో మొత్తం 40,049 ఓట్లుండగా, ఇందులో 24,251 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 10,572 (43.59 శాతం )ఓట్లు, కాంగ్రెస్‌కు 6,302 (25.99 శాతం), బీజేపీకి 3,710 (15.3 శాతం), స్వతంత్రులకు 3,123 (12.88శాతం) ఇతరులకు 544 (2.24శాతం) ఓట్లు వచ్చాయి. దుండిగల్‌లో 44,768 ఓట్లుండగా, ఇందులో 29,349 ఓట్లు పోలయ్యాయి. వీటిలో  టీఆర్‌ఎస్‌కు 13,973 (47.61శాతం )ఓట్లు, కాంగ్రెస్‌కు 6,391(21.78శాతం), బీజేపీకి 3,952 (13.47శాతం), స్వతంత్రులకు 4,923 (16.43శాతం) ఇతరులకు 210 (0.72శాతం) ఓట్లు వచ్చాయి. 


 ఘట్‌కేసర్‌లో 42 శాతం

ఘట్‌కేసర్‌లో మొత్తం 26,592 ఓట్లుండగా, ఇందులో 18,274 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 7,681 (42.03శాతం )ఓట్లు, కాంగ్రెస్‌కు 4,779 (26.15శాతం), బీజేపీకి 1,219 (6.67శాతం), స్వతంత్రులకు 4,581 (25.07శాతం) ఇతరులకు 14 (0.08శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. గుండ్లపోచంపల్లిలో మొత్తం 15,030 ఓట్లుండగా, ఇందులో 10,438 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్‌ఎస్‌కు 4,851 (46.47శాతం )ఓట్లు, కాంగ్రెస్‌కు 2,402(23.01శాతం), బీజేపీకి 2,325 (22.27శాతం), స్వతంత్రులకు 860 (8.24శాతం) ఇతరులకు ఒక్క ఓటు కూడా రాలేదు. కొంపల్లిలోలో మొత్తం 24,208 ఓట్లుండగా, ఇందులో 16,193 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 6,515 (40.23శాతం )ఓట్లు, కాంగ్రెస్‌కు 5,230 (32.3శాతం), బీజేపీ 3,259 (20.13 శాతం) ఓట్లు, స్వతంత్రులకు 1,148 (7.09 శాతం) ఇతరులకు 41 (0.25శాతం) ఓట్లు వచ్చాయి. మేడ్చల్‌లో మొత్తం 37,270 ఓట్లుండగా, ఇందులో 25,007 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 11,606 (46.41శాతం)ఓట్లు, కాంగ్రెస్‌కు 5,641 (22.56శాతం ), బీజేపీకి 2,289(9.15శాతం) ఓట్లు, స్వతంత్రులకు 5,147 (20.58శాతం) ఇతరులకు 324 (1.3శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. పోచారంలో మొత్తం 21,717 ఓట్లుండగా, ఇందులో 15,053 ఓట్లు పోలయ్యాయి.టీఆర్‌ఎస్‌కు 7,106 (47.21శాతం)ఓట్లు, కాంగ్రెస్‌కు 2,211(14.69శాతం), బీజేపీకి 1,981 (13.16శాతం), స్వతంత్రులకు 3,259 (21.65శాతం) ఓట్లు, ఇతరులకు 496 (3.3శాతం) ఓట్లు వచ్చాయి. తూంకుంట మున్సిపాలిటీలో మొత్తం 19,584 ఓట్లుండగా, ఇందులో 14,364 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 5,619 (39.12శాతం)ఓట్లు, కాంగ్రెస్‌కు 2,478(17.25శాతం), బీజేపీకి 1,205 (8.39శాతం) ఓట్లు, స్వతంత్రులకు 5,031 (35.03శాతం) ఓట్లు, ఇతరులకు 31 (0.22శాతం) ఓట్లు వచ్చాయి.logo
>>>>>>