సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:43:02

భారతమాతకు మహాహారతి

భారతమాతకు మహాహారతి

ఖైరతాబాద్‌: నెక్లెస్‌రోడ్‌లోని హెచ్‌ఎండీ ఏ మైదానంలో  భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం చేపట్టిన మహాహారతి మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. మూడు వేల మంది చిన్నారులు భారత మాతను స్మరిస్తుండగా తల్లీ నీకు వందనమంటూ వివిధ రూపాల్లో ‘అమ్మ’కు మహాహారతి సమర్పించారు. ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీ బాయిని  స్మరిస్తూ మరాఠా వారియర్స్‌  చేసిన నృత్యాలు, చిత్రకారుడు కాంత్‌ రీసా సీఏఏ విశిష్ట తను తెలుపుతూ వేసిన సాండ్‌ ఆర్ట్‌, సర్జికల్‌ స్ట్రయిక్‌పై విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టు కున్నాయి. భారతమాతఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ మాట్లాడుతూ భారతమాతను స్మరిస్తూ, గౌరవిస్తూ మహాహారతి నివ్వడం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నేటి యువత లో దేశభక్తి భావం పెంపొందించాల్సిన అవసరంపందన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌,  అవదాని గరికపాటి నరసింహ రావు  బీజేపీరాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు రాములు, ఎమ్మెల్సీరాంచందర్‌రావు,ఐ ఫోకస్‌ వ్యవ స్థాపకులు వాసుదేవరావు,  ముప్పవరపు హర్షా  తదితరులు పాల్గొన్నారు. 


logo