సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:41:40

మహా హారతి..

మహా హారతి..
  • మీర్‌పేట, బడంగ్‌పేట మేయర్‌ పదవులు టీఆర్‌ఎస్‌కే !

బడంగ్‌పే(నమస్తే తెలంగాణ): బడంగ్‌పేట మేయర్‌ పదవి కైవసం చేసుకోవడం కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రయత్నం చేశాయి. అయితే 31వ వార్డు నుంచి గెలిచిన చిగిరింత నర్సింహరెడ్డి మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆపార్టీకి సంపూర్ణ మద్దతు వచ్చింది. పారిజాత నర్సింహరెడ్డితో పాటు మరో నలుగురు  కార్పొ రేటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపునున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ కావలసిన సంఖ్య కన్న ఎక్కువ సంఖ్య కావడంతో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సీటు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూడ టీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ పదవి దక్కించుకోనుంది. టీఆర్‌ఎస్‌కు 19 కార్పొరేషన్‌ సీట్లు వచ్చాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులు 8మంది విజయం సాధించారు. వారంతా టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. వారంతా టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు కావ డంతో వారు సొంత గూటికి పోయారు.


logo