గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:40:57

కులాంతర మతాంతర వివాహాలు చైతన్యంతో కూడుకున్నవి

కులాంతర మతాంతర వివాహాలు చైతన్యంతో కూడుకున్నవి

కవాడిగూడ: కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్కులో కులాంతర మతాంతర వివాహితుల మేళా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు సి.ఎల్‌.ఎన్‌.గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగారాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్‌, విశిష్ఠ అతిథిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న నూతన దంపతులను వారు ఘనంగా సన్మానించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలోనే కులాలు ఉన్నాయని రాజకీయ పార్టీలు వీటిని తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసి దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ అని కొనియాడారు. కుల, మత అంతరాలు లేని సమాజాన్ని ఆశించిన ఆయన ఆశయాలు నేటికీ నెరవేర లేదన్నారు. కులాంతర మతాంతర వివాహాలు ఎంతో చైతన్యంతో కూడుకు న్నవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 


కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారు సమాజంలో ఆదర్శంగా జీవించా లన్నారు. అనంతరం తెలంగాణ మానవ హక్కుల కమీషన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య మాట్లాడుతూ  సామాజిక వైరుధ్యాలు మనుషులను దూరం చేయడానికి కాదని, కాలానికి అనుగుణంగా వైరుధ్యాలను పరిష్కరించుకొంటూ మనుష్యులు దగ్గర వ్వాలన్నారు. కులాలు, మతాలు, భాషలు మనుషులను వేరుచేసేందుకు కాదని, మనుషుల మధ్యన ఐక్యత సంబంధాలు కలుగజేసేందుకని చెప్పారు. సమాజంలో ఉన్న అభ్యంతరాలను అధిగమించి ఒక్కటైన ప్రేమమూర్తులు చైతన్యంతో జీవించి, ఆదర్శంగా నిలవాలని సూచించారు. నవసమాజాన్ని నిర్మించేందుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. కుల, మత రహిత సమాజం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బసవరాజు సారయ్య, తెలంగాణ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జి.రాధా రాణి, తెలంగాణ ఇంటిపార్టీ కలుగజేసేందుకని చెప్పారు. సమాజంలో ఉన్న అభ్యంతరాలను అధిగమించి ఒక్కటైన ప్రేమమూర్తులు చైతన్యంతో జీవించి, ఆదర్శంగా నిలవాలని సూచించారు. నవసమాజాన్ని నిర్మించేందుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. కుల, మత రహిత సమాజం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బసవరాజు సారయ్య, తెలంగాణ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జి.రాధా రాణి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, సంఘం సలహాదారు టి.వి.దేవదత్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, టీఈఎమ్‌జేయూ అధ్యక్షుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌, ఊసా, పిఓడబ్ల్యూ సంధ్య, సామాజిక విశ్లేషకులు సజయ, సమసమాజం అధ్యక్షులు డాక్టర్‌ ఓంప్రకాష్‌, రచయిత్రి యలవర్తి అనురాధ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యం.డి. వహీద్‌, ప్రధాన కార్యదర్శి డి.ఎల్‌.కృష్ణచంద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>