మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:39:52

చిత్రకారులకు అండగా ఆర్ట్‌ గ్యాలరీ

చిత్రకారులకు అండగా ఆర్ట్‌ గ్యాలరీ

కొండాపూర్‌: కళాకారులను ప్రోత్సహించడంలో చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ 16వ వార్షిక వేడుకల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రకారులకు చేయూతనిచ్చేందుకు ఆర్ట్‌ గ్యాలరీ మంచి వేదికగా నిలుస్తుంది. కళలు, కళాకారుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునిస్తుందని, ఇప్పటికే కళాకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవచూపుతున్నట్లు తెలిపారు. ఆర్ట్‌ గ్యాలరీ వార్షిక వేడుకలు జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కొనసాగుతాయని, వేడుకల్లో భాగంగా చిత్రకారులు గీసిన పలు చిత్రాల ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ట్‌ గ్యాలరీ నిర్వహకులు తెలిపారు. కాగా ఆదివారం 160 మంది చిత్రకారులు గీసిన చిత్రా లను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాం స్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ డాక్టర్‌ కే లక్ష్మి, సీని యర్‌ చిత్రకారులు డాక్టర్‌ లక్ష్మాగౌడ్‌, లక్ష్మణ్‌ ఏలే, నగేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.


ఆర్టిస్ట్‌ స్టూడియో ప్రారంభం... 

చిత్రకారులకు తోడ్పాటునిచ్చే ప్రక్రియలో భాగంగా ఆర్ట్‌ గ్యాలరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్‌ స్టూడియోను ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు. యువ, పేద చిత్రకారులకు చేయూతనిచ్చేందుకు, చిత్రాలు గీసుకునేందుకు స్థలాన్ని ఉచితంగా అందించడంతో పాటు సీనియర్‌ చిత్రకారుల సలహాలు, సూచనలను పొందేలా ఆర్టిస్ట్‌ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ లక్ష్మి తెలిపారు. చిత్రకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఆర్టిస్ట్‌ స్టూడియోను రూపొందించినట్లు, అవసరమైన వారు స్టూడియోను వినియోగించుకోవచ్చని తెలిపారు. 


logo
>>>>>>