సోమవారం 30 మార్చి 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:38:36

సొంత ఖర్చులతో వ్యవసాయ పరిశోధనలు

సొంత ఖర్చులతో వ్యవసాయ పరిశోధనలు

తన సొంత ఖర్చులతో వ్యవసాయ సాగులో పరిశోధనలు చేస్తున్నారు వెంకట్‌రెడ్డి, వరి, గోధుమ, కూరగాయలపై పరిశోధనలకు ప్రతి మెళకువను తెలుసుకునేందుకు రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు.2004 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పలు పంటలపై పరిశోధనలు విజయవంతంగా చేశారు. దేశంలోని లక్షలాది మంది రైతులు వెంకట్‌రెడ్డి చేస్తున్న సేంద్రియ సాగును అనుసరిస్తున్నారు. సేంద్రి య ఎరువులకు అధిక ప్రాధాన్యత ఇస్తే అంతర్జాతీయ మార్కెట్లో పంటలకు మంచి డిమాండ్‌ ఉంటుందని వెంకట్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ సాగులో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన నాకు పద్మశ్రీ పురస్కారం రావడం ఆనందంగా ఉందని వెంకట్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.


logo