గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:36:44

వినూత్న ఆలోచనే.. విప్లవాత్మకమైన మార్పునకు నాంది

 వినూత్న ఆలోచనే.. విప్లవాత్మకమైన మార్పునకు నాంది

మల్కాజిగిరి,(నమస్తే తెలంగాణ): వినూత్న ఆలోచనలే విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికాయని అల్వాల్‌కు చెందిన రైతు చింతల వెంకట్‌రెడ్డి అన్నారు. 2004 సంవత్సరం నుంచి సేంద్రియ పద్ధ్దతితో వ్యవసాయం చేస్తూ, పలు పంటలపై పరిశోధనలు చేస్తున్న అల్వాల్‌కు చెందిన చింతల వెంకట్‌రెడ్డిని కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. అల్వాల్‌లోని తన వ్యవసాయ క్షేత్రాన్నే పంటలపై సేంద్రియ పద్ధతిలో చీడపీడల నివారణ కోసం పరిశోధనలు చేపట్టారు. వరి, గోధుమ పంటలపై పరిశోధనలు చేసి విటమిన్‌ డీని చొప్పించిన ఘనత వెంకట్‌రెడ్డిది. వరి, గోధుమ పంటల్లో ఏ,సీ విటమిన్లతో పాటు వెంకట్‌రెడ్డి చేసిన పరిశోధన విజయవంతమై విటమిన్‌ డీ జోడు కావడంతో అనేక రోగాలకు వ్యాధి నిరోధక శక్తిగా పనిచేయనుంది.క్యాన్సర్‌, గుండెపోటుకు గురికాకుండా  కాల్షియం పెరిగి మనుషులు ఆరోగ్యంగా ఉంటారు.అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు పొందిన వెంకట్‌రెడ్డికి 70 దేశాల్లో మట్టి ఎరువుతో చీడపీడల నివారణపై పేటెంట్‌ హక్కులు వెంకట్‌రెడ్డి పొందాడు. 


logo