గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:35:48

సెక్యులర్‌ భావజాలం.. సీఎం కేసీఆర్‌ది..

సెక్యులర్‌ భావజాలం.. సీఎం కేసీఆర్‌ది..
  • -సినీ నటుడు ఆర్‌.నారాయణ మూర్తి

అబిడ్స్‌,నమస్తే తెలంగాణ:సీఎం కేసీఆర్‌ సెక్యులర్‌ భావాలతో ముం దుకు సాగుతున్నారని ప్రముఖ దర్శకనిర్మాత, సినీ నటులు ఆర్‌.నారాయణమూర్తి కొనియాడారు. న్యూస్‌ పేపర్స్‌ హాకర్స్‌ అసోసియేషన్‌ అబిడ్స్‌ ఆధ్వర్యంలో అబిడ్స్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, అన్ని కులాలు, మతాల వారికి సమ ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. హైదరాబాద్‌ నగరం మినీ ఇండియాగా పేరుగాంచిందని, ఈ నగరంలో అన్ని రాష్ర్టాలకు చెందిన వారు జీవిస్తున్నారని తెలిపారు. పేపర్‌ హాకర్స్‌ ప్రజలు, యాజమాన్యానికి వారధిలా ఉండి పత్రికను తెల్లవారగానే పాఠకులకు అందిస్తారని కొనియాడారు. వారు పేపర్‌ హాకర్‌లు కాదని, పేపర్‌ హీరోలని అభివర్ణించారు. అనంతరం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే గిఫ్ట్‌లను హాకర్స్‌కు నమస్తే తెలంగాణ సర్క్యులేషన్‌ జనరల్‌ మేనేజర్‌ డి రాంరెడ్డితో కలిసి అందచేశారు.కార్యక్రమంలో న్యూస్‌ పేపర్స్‌ హాకర్స్‌ అసోసియేషన్‌ అబిడ్స్‌ అధ్యక్షుడు సి.వినోద్‌కుమార్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు శాంతిదేవి, పలుపత్రికల జనరల్‌ మేనేజర్‌లు, సర్క్యులేషన్‌ అధికారులు, సిబ్బంది, హాకర్స్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>