బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:35:06

కేబీఆర్‌ పార్క్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆత్మీయ సమ్మేళనం

కేబీఆర్‌ పార్క్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆత్మీయ సమ్మేళనం

బంజారాహిల్స్‌ (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆత్మీయ సమ్మేళనం నార్సింగిలోని ఓమ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం  జరుపుకున్నారు. ఈ సందర్భంగా  వాకర్లకు యోగా, వాకింగ్‌,  లాఫింగ్‌,మ్యూజికల్‌ చైర్స్‌, తంబోలా తదితర పోటీలను నిర్వ హించి విజేతలకు బహుమతులు అందజేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలి  చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మా ట్లాడుతూ కేబీ ఆర్‌ పార్కులో వాకింగ్‌ చేసేవారంతా ఆరోగ్యంపై శ్రద్ధతో ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవడం అభి నందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.జైవీర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏవిజయ్‌ కుమార్‌, జి.నర్సింహారావు, బి.శరత్‌ గోపాల్‌, బి.రమేష్‌రెడ్డి, వి.రాజగోపాల్‌రెడ్డి, ఫణీంద్ర, మద్ది లక్ష్మా రెడ్డి,రాహుల్‌ సింఘాల్‌, శాంతి నీలమ్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 


logo