ఆదివారం 29 మార్చి 2020
Hyderabad-city - Jan 27, 2020 , 06:33:40

మేయర్‌, చైర్‌ పర్సన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

 మేయర్‌, చైర్‌ పర్సన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఈ నెల 25న వెలువడిన పురపోరు ఫలితాల్లో జిల్లా పరిధిలోని 9 మున్సిపాలిటీలలో, నాలుగు కార్పొరేషన్లలో నేడు మేయర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్ల ఎంపిక జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యా ల యాల్లో అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సాధారణంగా గెలిచిన కౌన్సిలర్లు, కార్పొ రేటర్లతో పాటు ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రజా ప్రతినిధులకు కార్యాలయంలోనికి ఆహ్వానం ఉంటుంది. మున్సిపాలిటీ ఆథరైస్జ్‌ అధికారుల సమక్షంలో సోమవారం ఉదయం 11 గంటలకు గెలిచిన అభ్యర్థులతో ప్రమాణాస్వీకారం చేయిస్తారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్‌పర్సన్‌, డిప్యూటీ చైర్‌ పర్సన్‌ల ఎన్నికల కొరకు ప్రత్యేక సమావేశంను నిర్వహిస్తారు. ఇందులో పార్టీల వారిగా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి ఏ పార్టీ అభ్యర్థులను అదే పార్టీకి కేటాయించిన గ్యాలరీలో సీట్లను ఏర్పాటు చేస్తారు.  అధికారులు అభ్యర్థుల మద్దతు (మేయర్‌ అభ్యర్థికి మద్దతుగా చేతులు పైకి ఎత్తడం)గా బలాబలాలను పరిశీలించి ఎక్కువ మెజార్టీ ఉన్న అభ్యర్థిని మేయర్‌గా ఎన్నుకుంటారు. 


logo