గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 22, 2020 , 03:40:40

పిచ్చికుక్క సైర విహారం

పిచ్చికుక్క సైర విహారం
  • - సీఎం కార్యాలయం సమీపం నుంచి ధరమ్ రోడ్డు వరకు పరుగులు
  • - దాదాపు 50 మందికి గాయాలు
  • - గాయపడిన వారిలో వైద్యుడు, విద్యార్థులు, మహిళలు, యువకులు
  • - చివరకు ప్రజల చేతుల్లో మృతువాత





అమీర్ నమస్తే తెలంగాణ  : పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. సీఎం కార్యాలయం సమీపం నుంచి ధరమ్ రోడ్డు వరకు పరుగులు తీస్తూ దాదాపు 50 మందిని గాయపర్చింది. చివరకు అమీర్ సత్యం థియేటర్ వద్ద స్థానికుల చేతుల్లో తీవ్రంగా గాయపడి అక్కడిక క్కడే మృతి చెందింది. జీహెచ్ వెటర్నరీ విభాగం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పిచ్చికుక్క సంచరిస్తున్నట్లు మొదటి ఫిర్యాదు జీహెచ్ యాప్ మధ్యా హ్నం ఒంటిగంటకు అధికారులు చూశారు. బీఎస్ ఒకరిని గాయపర్చిందని సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం కుక్కను పట్టుకునేందుకు ప్రయత్నించింది.

కానీ అప్పటికే కుక్క బేగంపేట్ కుం దన్ చిన్మయమిషన్ స్కూల్ వద్ద సంచరిస్తోందని తెలుసుకొని వెళ్లారు. కానీ అది కనిపించకుండాపోయింది. సాయంత్రం 4 గంటల సమయంలో అమీర్ డీకే రోడ్డులో అందరినీ కరుస్తోందనే సమాచారం మేరకు వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లారు. అప్పటికే రోడ్డు మీద వచ్చీపోయే వారిని దాదాపు 50మందిని గాయపర్చింది. జీహెచ్ సిబ్బంది వచ్చే లోపే రోడ్డుపై కుక్క చేస్తున్న బీభత్సాన్ని నియంత్రించేందుకు స్థానికులు ఇటుకలు, కర్రలతో కొట్టి చంపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

గాయపడిన వారిలో వైద్యుడు, విద్యార్థులు

వీరంగం సృష్టించిన కుక్క వల్ల గాయపడినవారిలో చల్లా దవాఖాన వైద్యుడు జగదీశ్, విద్యార్థులు, పలువురు మహిళలు, యువకులున్నారు. ఎస్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లింగేశ్వర్, రాంబాబు, కోటేశ్వర్ నాగరాజు, జాహ్నవి, అమూల్య డీకేరోడ్డు చల్లా దవాఖానలో సత్య, కృష్ణవేణి, పంకజ్, లావణ్య, బాలనర్సింహ, మురళీమోహన్ వైశాలి, హరికృష్ణ అమీర్ వెల్ దవాఖానలో మధు, శ్రేయాన్ష్, అహల్య ఔట్ విభాగంలో వైద్యం చేయించుకున్నారు.

బీఎస్ మక్తా నుంచి స్వైరవిహారం చేస్తూ దాదాపు 50మందిని గాయపర్చిన తర్వాత స్థానికుల చేతుల్లో మృతి చెందిన కుక్క అసలు పిచ్చిపిచ్చిగా ఎందుకు వ్యవహరించిందనే విషయం పోస్ట్ తర్వాతే తెలుస్తుందని జీహెచ్ ఖైరతాబాద్ వెటర్నరీ అధికారి జెవ్యానాయక్ తెలిపారు. ఈ కుక్కకు రేబిస్ సోకిందా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని, అయితే ఈ కుక్కను పట్టుకునే క్రమంలో నాలుగు ఇతర కుక్కలను కూడా సిబ్బంది పట్టుకున్నారని, అయితే అవి మామూలుస్థితిలోనే ఉన్నాయని తెలిపారు. ఈ కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన వదిలేస్తామని చెప్పారు.



logo
>>>>>>