సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 20, 2020 , 01:49:52

ఉప్పల్‌ శిల్పారామంలో మరిన్ని అందాలు

ఉప్పల్‌ శిల్పారామంలో మరిన్ని అందాలు
  • - అదనపు స్టాళ్లు, మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, మ్యూజియం ఏర్పాటు
  • - రూ. ఐదు కోట్లు కేటాయించిన హెచ్‌ఎండీఏ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఈస్ట్‌ కారిడార్‌లో పల్లె అందాలు పట్నం వాసులను ఆకట్టుకున్నాయి. హస్తకళలు, చేనేత వస్ర్తాలకు నిలయంగా పేరొందిన మాదాపూర్‌లోని శిల్పారామం మాదిరిగానే మూసీనది తీరం లో హెచ్‌ఎండీఏ ఏడున్నర ఎకరాల స్థలంలో రూ. ఐదు కోట్లు ఖర్చు చేసి మినీ శిల్పారామాన్ని నిర్మించిం ది. హస్తకళలు, చేనేత వస్ర్తాల కోసం 50 స్టాళ్లను నిర్మించారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. పెద్దలు సేదతీరడానికి మైదానాన్ని సిద్ధ్దం చేశారు. ఎటూచూసిన పచ్చని అందాలు కనువిందు చేసేలా ల్యాండ్‌ స్క్రేపింగ్‌ పనులు చేపట్టారు. చూపరులను ఆకట్టుకునే రీతిలో శిల్పారామం ఆర్చీ (ప్రవేశ ద్వారాన్ని) ఏర్పాటు చేశారు. దీనికి ఎదురుగా ఫౌంటేన్‌ను నిర్మించారు. విభిన్న రుచులతో ఫుడ్‌కోర్టు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేంపదకు పెద్ద యాంపీ థియేటర్‌ని సిద్ధ్దం చేశారు.

వెదురు బొంగుళ తో స్టాళ్లు నిర్మించారు. తూర్పుదిశగా ఉన్న భాగ్యనగర ప్రజలను ఎంతగానో అబ్బురపరుస్తున్నాయి. గడిచిన ఏడునెలలుగా అందుబాటులోకి వచ్చిన ఈ మినీ శిల్పారామంలో వీకెండ్‌ రోజుల్లో నిత్యం సందర్శకులతో కళకళలాడుతున్నది. సాయంకాలం సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సందర్శకుల తాకిడి గణనీయంగా పెరుగుతుండడంతో మరిన్ని అందాలను సమకూర్చాలని శిల్పారామం అధికారులు నిర్ణయించారు. మ్యూజియం, మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, అదనపు స్టాళ్లు, వాటర్‌ ఫౌంటెయిన్‌ తదితర డిమాండ్‌కు అనుగుణంగా నూత న హంగులు సమకూర్చేందుకుగానూ చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు రూ. ఐదు కోట్లు నిధులను కేటాయించాలన్న శిల్పారామం అధికారుల విజ్ఞప్తి మేరకు హెచ్‌ఎండీఏ ఇటీవల రూ. 5 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పనులు చేపట్టి మరిన్ని అందంగా శిల్పారామంను సిద్ధ్దం చేస్తామని అధికారులు పేర్కొన్నారు.    logo