శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 20, 2020 , 01:45:37

సిద్ధమవుతున్న కలల సౌధాలు

సిద్ధమవుతున్న కలల సౌధాలు


మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లకు చరమగీతం పాడాలి.. రాష్ట్ర రాజధాని నగరంలో పేద ప్రజలకు అత్మగౌరవంతో కూడిన ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన పేదోడి కలల సౌధాలు మేడ్చల్‌ జిల్లాలో సిద్ధమవుతున్నాయి. జిల్లా ప్రజలతో పాటు హైదరాబాద్‌ పట్టణ ప్రాంతంలో ఇండ్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఇచ్చేందుకు  ప్రభుత్వం రూ.4 వందల కోట్లను మంజూరు చేసింది. సింగంచెరువు తండాలో నిర్మించిన ఇండ్లను ఇప్పటికే అర్హులైన పేదలకు కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే మరో 10 వేల మందికి ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఇండ్లను కేటాయించేందుకు  ప్రభుత్వం జిల్లా పరిధిలో సుమారు 36,216 ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో సింగం చెరువు తండాలో 176 ఇండ్లు, గాజుల రామారంలో 144, జమ్మిగడ్డలో 56, అహ్మద్‌గూడలో 4,428, కుత్బుల్లాపూర్‌లో దొమ్మరపోచంపల్లిలో 1,404, దొమ్మరపోచంపల్లి-2లో 216 , బహదూర్‌పల్లిలో 900 ఇండ్లను, చిత్తారమ్మబస్తీలో 108, కొల్తలాపూర్‌లో 144 ఇండ్లను నిర్మిస్తున్నారు. అలాగే బాచుపల్లిలో 1,080 ఇండ్లను, కౌసర్‌నగర్‌లో 756, జవహర్‌నగర్‌-3లో 620, రాంపల్లిలో 6,240, ప్రతాపసింగారంలో 2208 ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తూంకుంటలో 1,656, జవహర్‌నగర్‌-1లో 900,  జవహర్‌నగర్‌-2లో 720 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మురహరిపల్లిలో 2,484 ఇండ్లు, మల్లాపూర్‌-2లో 396 ఇండ్లు, చైతన్యనగర్‌లో 240 ఇండ్లు, శ్రీరాంనగర్‌లో 756 ఇండ్లు, కొర్రెములలో 800, ఆదర్శనగర్‌లో 88 , దుండిగల్‌లో 3,996 ఇండ్లు, చెర్లపల్లిలో 360, నిజాంపేటలో 1,440, బౌరంపేటలో 1,620, గాగిల్లాపూర్‌లో 640, బోగారంలో 1,080 ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం 30963.60 లక్షలను ఖర్చు చేస్తుంది.

176.30 ఎకరాల భూమి కేటాయింపు..

పట్టణ ప్రాంత ప్రజల కోసం నిర్మించనున్న మొత్తం 36,210 ఇండ్లకు అవసరమైన సుమారు 176.30 ఎకరాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు  కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి కేటాయించారు. ఇందులో బాచుపల్లి, నిజాంపేటలో సర్వే నంబర్‌ 344/2లో 5.11 ఎకరాలు, 344/3లో 1 ఎకరాలు, 344/4లో 0.10 ఎకరాలు, బాచుపల్లిలో సర్వే నంబర్‌ 186/2లో 5 ఎకరాలు, 186/3లో 2 ఎకరాలు, 186/5లో 3.20 ఎకరాలను, 186/6లో 3.20 ఎకరాలు, 186/7లో 3 ఎకరాలు, 186/14 ఎకరాలను కేటాయించారు. అలాగే గాగిల్లాపూర్‌లో 214/2లో 5.14 ఎకరాలు, దుండిగల్‌లో 453/1/2లో 2.12 ఎకరాలు, 453/1/3లో 6.35 ఎకరాలు, 454/1/2లో 8.26 ఎకరాలు, 454/1/3లో 1.17 ఎకరాలు, 453/4లో, 453/5లో, 454/6లో 6.5 ఎకరాలను కేటాయించారు. దొమ్మరపోచంపల్లిలో 119/3లో 5 ఎకరాలు, 119/3లో 2 ఎకరాలు, 119లో 0.15 ఎకరాలు, బౌరంపేటలో 166లో 10.19 ఎకరాలు, బహదూర్‌పల్లిలో 131లో 5.04 ఎకరాలు, గాగిల్లాపూర్‌లో 214/10లో 5.37 ఎకరాలు, గాజులరామారంలో 345/3లో 4.08 ఎకరాలు, కాప్రాలో 199/పీలో 1.20 ఎకరాలను, జవహర్‌నగర్‌లో 775లో 5 ఎకరాలను, 776లో 5 ఎకరాలను, 784లో 5 ఎకరాలను కేటాయించారు. అలాగే జవహర్‌నగర్‌లోని 936/2లో 4.4 ఎకరాలు, 938లో 3.10 ఎకరాలు, 939/2లో 1.10 ఎకరాలు, 940/2లో 0.32 ఎకరాలు, 942లో 5 ఎకరాలను, 943/2లో 2.23 ఎకరాలు, 829/2లో 5.19 ఎకరాలు డబుల్‌ ఇండ్ల కోసం  కేటాయించారు. కాప్రాలోని 710/పీలో 4 ఎకరాలు, చెర్లగూడలో 586/2/3లో 1.13 ఎకరాలు, చెర్లపల్లిలోని 69 సర్వే నంబర్‌లో 2 ఎకరాలను కేటాయించారు. ఘట్‌కేసర్‌ యమ్నంపేటలోని 140/2లో 5 ఎకరాలను, కొర్రెములలో 141/2లో 6 ఎకరాలను, ప్రతాపసింగారంలోని 378/1/3లో 22.06 ఎకరాలు, 378/60 నుంచి 378/70 వరకు 11.26 ఎకరాలను కేటాయించారు. కీసరలోని బోగారంలో 283/2లో 10 ఎకరాలను, కుందన్‌పల్లిలోని 152/2/2లో 2.12 ఎకరాలను, 153/2/2లో 1.21 ఎకరాలను కేటాయించారు. శామీర్‌పేటలో మురహరిపల్లిలోని 60/1/2లో 18                ఎకరాలను కేటాయించారు.

పూర్తయిన నిర్మాణాలు..

జిల్లాలో ప్రస్తుతం సుమారు 10 వేల వరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలోనే పంపిణీ చేసేందుకు అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో పీర్జాదిగూడలో జీ+2, పర్వతాపూర్‌లో జీ+1, యాద్గార్‌పల్లిలో వ్యక్తిగత ఇండ్లు, కీసరలో జీ+1, చెంగిచెర్లలో జీ+1, కొర్రెములలో వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. కిష్టాపూర్‌లో జీ+1, బోడుప్పల్‌లో జీ+2, ఘట్‌కేసర్‌ జీ+2, తుర్కపల్లి, చీర్యాల్‌లలో వ్యక్తిగత ఇండ్ల నిర్మాణాల చొప్పున మొత్తం 529 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అలాగే పట్టణ ప్రాంతాల ప్రజల కోసం ఇండ్లు కేటాయించేందుకు గాను 144 జీ+3 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, ఉప్పల్‌ జమ్మాయిగూడలో 56 జీ+3 ఇండ్లు, అహ్మద్‌గూడలో 4428 సీ+ఎస్‌+9 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, దొమ్మరపోచంపల్లిలో 1,404 సీ+ఎస్‌+9 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, దొమ్మరపోచంపల్లి-2లో 216 సీ+ఎస్‌+9 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, బహదూర్‌పల్లిలో సీ+5 9 వందల ఇండ్ల నిర్మాణాల చొప్పున మొత్తం 7,148 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

సకల సౌకర్యాలు

గత ప్రభుత్వాలు ఇచ్చినట్లుగా కాకుండా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల్లో ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ అవసరాలను కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో పార్కులను, ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులను, కిడ్స్‌ పార్కులను, రోడ్డు సౌకర్యం, తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, అధునాతన విధానంలో డ్రైనేజీ వ్యవస్థ, రేషన్‌ దుకానం ఇలా అనేక వసతులతో గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలను తలపించేలా ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కాలనీలను తీర్చిదిద్దుతున్నది.logo