శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 20, 2020 , 01:39:20

అభివృద్ధికే పట్టం కట్టండి

అభివృద్ధికే పట్టం కట్టండి


మణికొండ, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్‌ అందజేస్తున్న సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలోని నార్సింగి/మణికొండ మున్సిపాలిటీల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవులలో 10,15,18 వార్డుల అభ్యర్థులు శిరీషక్రాంతి, సంధ్యారమేశ్‌, సర్వన్‌లకు మద్దతుగా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.  ప్రజాసంక్షేమం కోసం పాటుపడే టీఆర్‌ఎస్‌ సర్కారుకు ప్రజలు ఎల్లప్పుడు అండగా ఉంటారని ధీమావ్యక్తంచేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఎనలేని కృషిచేస్తున్నారన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన ప్రణాళికలన్నింటినీ సిద్ధం చేసిందని, ఎన్నికల అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. అనంతరం మణికొండ మున్సిపాలిటీలో మంత్రి తలసాని పర్యటించారు.

చిత్రపురికాలనీలోని 1,2 వ వార్డుల అభ్యర్థులు కొమర విజయలక్ష్మి, వసంతకుమార్‌లకు మద్దతుగా ప్రజలంతా నిలవాలని కోరారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలలోని అన్ని వార్డులలో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించడం ఖాయమని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌  ధీమావ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులను గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ టి.మల్లేశ్‌, ఆయా వార్డుల అభ్యర్థులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo