మంగళవారం 31 మార్చి 2020
Hyderabad-city - Jan 19, 2020 , 00:22:01

సిటీ ఫ్లైఓవర్లకు ధగ

సిటీ ఫ్లైఓవర్లకు ధగ
  • - పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, మాసాబ్‌ట్యాంక్‌ ఫ్లైఓవర్‌పై లైట్ల ఏర్పాటు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర సుందరీకరణలో భాగంగా సెంట్రల్‌ జోన్‌ పరిధిలో జంక్షన్ల అభివృద్ధి, ఫ్లైఓవర్లపై విద్యుత్‌కాంతుల ఏర్పాటు తదితర పనులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకునేవారికి స్వాగతం పలికే విధంగా పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పాటుచేసిన ఆధునిక లైటింగ్‌ పలువురిని విశేషంగా ఆకర్శిస్తున్నది. అలాగే, మాసాబ్‌ట్యాంక్‌ ఫ్లైఓవర్‌పై కూడా కాంతులు విరజిమ్మే విధంగా లైట్లను ఏర్పాటుచేశారు. విద్యుత్‌ స్తంభాలకు చుట్టూ లైటింగ్‌ ఏర్పాటుచేయడం ఈ కొత్త విధానం ప్రత్యేకత. దుబాయిలో ఇదే విధంగా విద్యుత్‌ కాంతులతో ఫ్లైఓవర్లు, వీధులను అలంకరిస్తారని, అదే తరహాలో మన నగరంలో ఈ రెండు ఫ్లైఓవర్లపై ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. స్పందన బాగుంటే ఇతర ఫ్లైఓవర్లపై కూడా ఇదే తరహా లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.logo
>>>>>>