శనివారం 28 మార్చి 2020
Hyderabad-city - Jan 18, 2020 , 00:41:54

శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి

 శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి


చార్మినార్‌: రాష్ట్రం ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించా లంటే అక్కడ ప్రశాంత వాతవరణంతోపాటు శాంతి భద్రత లు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర హోంమంత్రి మహ మూద్‌అలీ తెలిపారు. శుక్రవారం ఆయన పాతనగరంలోని పేట్లబుర్జ్‌ సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో 2020 సంవత్సరపు పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణా శిభిరాన్ని ప్రాంరభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సాగించాలంటే శాంతి భద్రతలతో పాటు ప్రశాంత వాతవరణం కల్పించడమే కీలకంగా భావించిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ పోలీస్‌ విభాగానికి అధిక ప్రాధాన్యం కల్పి స్తూ నిధులను సమకూర్చడంతోపాటు పోలీసు విభా గాలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని తెలిపారు. ఫలితంగా స్వల్పకాలంలోనే దేశంలోనే మెరుగైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తిం పు పొందిందని తెలిపారు.  రాష్ట్రంలో శాంతి భద్రత లకు అధిక ప్రాధాన్యత కల్పించడంతోపాటు మహిళా భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు.  పోలీసు విభాగంలో దశల వారిగా ఖాళీలను భర్తీ చేయడా నికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిం దని హోం మంత్రి తెలి పారు. అందులో భాగంగా 2015లో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది పోలీస్‌ సిబ్బందిని భర్తీ చేశామని తెలిపారు. 2020 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 16వేల మంది నియమకాన్ని పూర్తి చేయ డానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందులో పాతనగరంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో సంగారెడ్డి, సిద్ది పేట్‌, మెదక్‌ జిల్లాలకు చెందిన 194 మంది యువ కులకు కానిస్టేబుల్‌ శిక్షణను ప్రారం భిస్తున్నామని తెలిపారు. శిక్షణ కాలంలో కానిస్టేబుళ్లకు 9 వేలు, ఎస్సై అభ్యర్థులకు 11వేల ైస్టెఫండ్‌ చెల్లిస్తున్నామని తెలిపారు.
 
సమాజంలో ప్రతి ఒక్కరు పోలీసేనని నగర పోలీస్‌ కమి షనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. పోలీస్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిలో కామన్‌ సివిల్‌ మ్యాన్‌ ఉండాలని పిలుపు నిచ్చారు. కామన్‌ సివిల్‌ మ్యాన్‌లో ఓ పోలీస్‌ సిబ్బందిగా అలోచనాల సరళిని కలిగి ఉన్నపుడు నేరాల నియంత్రణతోపాటు సుస్థిర సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలని తెలిపారు. నగర పోలీస్‌ విభాగం మెరుగైన పనితీరుతో గత 6 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. న్యూ యార్క్‌ నుండి కార్య కలపాలు నిర్వహించే మెస్సార్‌ సంస్థ నగర పోలీస్‌ విభాగానికి ప్రత్యేక గుర్తింపు అందించిందని తెలిపారు. వరుసగా కేంద్రం నుండి నగర పోలీస్‌ బెస్ట్‌ పోలీసింగ్‌ అవార్డులను అందుకుంటూ బెస్ట్‌ పోలీసింగ్‌ ఫెర్ఫార్మెన్స్‌ కనబర్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర జాయిం ట్‌ సీపీ అవినాష్‌ మహంతి, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి, ట్రాఫిక్‌ అదనపు డీసీపీ బాబు రావు, చార్మినార్‌ ఏసీపీ అంజయ్య,  ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రిన్సి పల్‌ మద్దిలేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రదీప్‌రెడ్డిలతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


చేలాపురలో  ...

చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చేలాపుర పోలీస్‌ ట్రైనింగ్‌ ఇన్సిట్యూట్‌లో కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలకు చెం దిన శిక్షణా కానిస్టేబుల్‌ అభ్యర్థుల శిక్షణను ట్రాఫిక్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రారంభించారు. రెండు జిల్లాలకు చెందిన 249 మంది అభ్యర్థులు చేలాపుర ఇన్సిట్యూట్‌లో శిక్షణ పొందనున్నారని తెలిపారు. 9 నెలల పాటు నిరంత రంగా కొనసాగే శిక్షణ అనంతరం సివిల్‌ కానిస్టేబుళ్లుగా విధుల్లో చేరనున్నారని అనిల్‌కుమార్‌ తెలిపారు. సమాజం లో పోలీస్‌ విభాగానికి మరింత పేరు సంపాదిం చడానికి ప్రయత్నించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఇన్సిట్యూట్‌ ప్రిన్సిపల్‌ శ్యాసుందర్‌తో పాటు ఇతర అధి కారులు పాల్గొన్నారు.


logo