సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 17, 2020 , 00:45:47

అభివృద్ధీ.. వర్ధిల్లు..

 అభివృద్ధీ.. వర్ధిల్లు..
  • - దూసుకెళ్తున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు..అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు... టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రూపురేఖలే మారిపోయాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు.. నేడు అభివృద్ధికి చిరునామాలుగా మారాయి. మౌలిక వసతులతో అలలారుతున్నాయి.. హరితహారంతో పచ్చని శోభ సంతరించుకుంటే... ‘మిషన్ భగీరథ’ జలాలతో కళకళలాడుతున్నాయి.. రహదారులు, పారిశుధ్యం.. వీధిదీపాలు ఇలా అన్నింటా మేటీగా నిలుస్తున్నాయి.. మొత్తంగా బంగారు తెలంగాణ కల సాకారానికి తోడ్పాటునందిస్తున్నాయి.

ఐటీ రాకతో..

ఘట్ : పోచారం మున్సిపాలిటీ ఐటీ కంపెనీల రాకతో దినదినాభివృద్ధి చెందుతున్నది. పోచారంలో 2011 జనాభా లెక్కల ప్రకారం  21 వేల 946 మంది ఉండగా, ఓటర్లు 24 వేల 270 మంది ఉన్నారు. పోచారం, నారపల్లి, యాంనంపేట్, ఇస్మాయిల్ గ్రామ పంచాయతీలను కలిపి పోచారం మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. పోచారంలో ఇన్ఫోసిస్, జెన్ ప్యాక్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడి కంపెనీల్లో నిత్యం 25 వేలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగం చేస్తున్నారు. టీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  రైతులకు అటు పరిశ్రమలకు 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ పథకం కింద జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఇటీవలే గ్రామానికి మంచినీళ్లు సరఫరా అవుతున్నాయి.

దాదాపు 15 కోట్ల నిధులతో పలు చోట్ల వాటర్ ట్యాంకులు, పైపులైన్ ఏర్పాటు చేసి నీరందిస్తున్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా పెరుమాండ్ల కుంట, మిరాలం చెరువు, నారపల్లి పెద్ద చెరువును అభివృద్ధి చేశారు. నారపల్లిలోని భాగ్యనగర నందనవనం పార్కును సుందరంగా తీర్చిదిద్దడంతో పర్యాటకులు తరలివస్తున్నారు. రోడ్లకు పది కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించారు. ఇక ఘట్ గ్రామ పంచాయతీతో పాటు కొండాపూర్, ఎన్ నగర్ గ్రామాలను కలిపి మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. జనాభా 2011  లెక్కల ప్రకారం ఘట్ మున్సిపాలిటీ జనాభా 26 వేల 569 కాగా, ఓటర్లు 26 వేల 592 మంది ఉన్నారు. 14 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నారు.  ఎర్రమల్లె వాగుపై బొక్కోనిగూడ వద్ద నాలుగున్నర కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఘట్ రైల్వే ట్రాక్ వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 9 కోట్ల రూపాయలతో మున్సిపల్ పరిధిలోని ప్రధాన రోడ్లు వెడల్పు చేశారు.  మరో ఐదు కోట్ల నిధులతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు పురోగమన దిశగా ఉన్నాయి.

తీరిన నీటి గోస

మేడిపల్లి : గత పాలకుల హయాంలో పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ వాసులు నీటికి కష్టాలు పడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ చొరవతో మూడు ప్రాంతాల మంచినీటి సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నది. ఉప్పల్ ఎల్ రిజర్వాయర్ పైపులైను నుంచి పీర్జాదిగూడ వరకు సుమారు 35 కోట్లతో మిషన్ భగీరథ పథకంతో ప్రధాన పైపులైన్లు ఓవర్ హెడ్ ట్యాంకులు, లింక్ లైన్లు ఇంటింటికీ నీటిని అందించే దిశగా పనులు చేపట్టారు. అంతే కాకుండా పర్వాతాపూర్ సర్వే నంబర్ 10లో 80 డబుల్ బెడ్ రూం ఇండ్లు, పీర్జాదిగూడ సర్వే నంబర్ 199లో 84 డబుల్ బెడ్ గృహాలు పేదల కోసం కట్టిస్తున్నారు. పనులు పూర్తి కావొస్తున్నాయి. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో 30 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు, 15 కోట్లతో సీసీ రోడ్ల పనులు చేపట్టారు.

తాగునీటికి రూ.150 కోట్ల ప్రణాళికలు..

మణికొండ : రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సరికొత్త ప్రణాళికలతో అభివృద్ధికి బీజాలు పడుతున్నవి. కొత్తగా ఏర్పాటైన శంషాబాద్ మున్సిపాలిటీలో ఆరు గ్రామాలను కలిపి 25 వార్డులుగా విభజించారు. హరితహారం, మిషన్ కాకతీయ పథకాల ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటడం, చెరువుల పూడిక తీతతో పూర్వకళ సంతరించుకున్నది. మణికొండ మున్సిపాలిటీని మూడు గ్రామాలను కలిపి 20 వార్డులుగా విభజించారు. పంచాయతీల నుంచి అనేక కాలనీల్లో రహదారులు, పార్కుల అభివృద్ధి,  నెక్నాంపూర్ వంటి గ్రామంలో చిన్న, పెద్ద చెరువుల ప్రక్షాళన కోసం రూ.21కోట్ల నిధులను మంజూరు చేసి సుందరీకరణ చేపట్టారు. చెరువుల చుట్టూ వాకింగ్,ట్రాకింగ్, సైక్లింగ్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు ఈ ప్రాంతంలోని అన్ని పార్కులను హెచ్ ప్రత్యేక నిధులను వెచ్చించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. కృష్ణా, గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు ఇప్పటికే జలమండలి  అవసరమైన కాలనీల్లో పైపులైను పనులను పూర్తిచేసింది. అదేవిధంగా మున్సిపాలిటీ నిధులు సుమారు 50 కోట్లు వెచ్చించి సీసీరోడ్లు, మురుగునీటి కాలువలను అభివృద్ధి చేశారు. మరో ఐదు గ్రామాలను కలిసి బండ్లగూడ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ఈ గ్రామాల్లోని కాలనీలు, ప్రధాన రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.150 కోట్ల నిధులను ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రణాళికలను రూపొందించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నది.

నూతన హంగులతో...

మేడ్చల్ రూరల్ : మేడ్చల్ మండల పరిధిలో ఉన్న గుండ్లపోచంపల్లి కొత్త హంగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నది.  ఖరీదైన విల్లాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, భారీగా ఏర్పాటైన విద్యా సంస్థలతో మున్సిపాలిటీ స్థాయి ఆదాయాన్ని కలిగి ఉంది.  గతేడాది జూన్ 1న గ్రామ పంచాయతీగా ఉన్న గుండ్లపోచంపల్లి పూర్తిస్థాయిలోమున్సిపాలిటీగా ఏర్పడింది. ఇందులో కండ్లకోయ పంచాయతీ పూర్తిస్థాయిలో విలీనం కాగా, గౌడవెల్లి పంచాయతీలోని బాసర్ జ్ఞానాపూర్, పూడూరూ పంచాయతీలోని అర్కెలగూడలను కలిపారు.జనాభా 15,051. మొత్తం ఓటర్లు 14,978, పురుషులు  8,121, మహిళలు 6,857 ఉన్నారు. మున్సిపాలిటీగా ఏర్పడ్డాక అభివృద్ధి సాధిస్తున్నది.  రూ.1.5 కోట్ల రూపాయలతో ప్రతి వీధిలో భూగర్భ నీటి పారుదల వ్యవస్థను నిర్మించారు.  బీసీ, ఎస్సీ శ్మశాన వాటికలను రూ.10 లక్షలతో అభివృద్ధి చేశారు. మేడ్చల్ మండలంలో రింగురోడ్డు వెలుపలి గ్రామాలకు మిషన్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు. ఇందుకోసం 10 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులను నిర్మించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న నారాయణ చెరువుపై మినీ ట్యాంకు బండ్ కట్టించారు. కేంద్రం నిధులతో అండర్ నిర్మాణం జరిగింది.

స్వచ్ఛభారత్ గుర్తింపు..

బోడుప్పల్: బోడుప్పల్ సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నది. టీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రధాన రహదారి విస్తరణ, డంపింగ్ వైకుంఠదామలు, పార్కుల నిర్మాణానికి నిధులు వెచ్చించింది. మిషన్ కాకతీయ పథకంతో చెంగిచర్ల పోచమ్మకుంట, బోడప్పల్ చెరువులకు నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. బాలాజీహిల్స్ 1000 కేఎల్ దేవేందర్ 1000 కేఎల్ ట్యాంకులను నిర్మించి 162 కాలనీల్లో మంచినీరు రోజు విడిచి రోజు అందిస్తున్నారు. బోడుప్పల్ 2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష, 52వేల 156 మంది ఉండగా, 73వేల 597 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అందులో 38వేల 292 మంది పురుషులు, స్త్రీలు 35వేల 303 మంది ట్రాన్స్ ఇద్దరు ఉన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచర్ల పిట్టల బస్తీలో 75, రాజీవ్ నగర్ 75, బేడ బుడిగజంగాల కాలనీల్లో 50 డబుల్ ఇండ్లు పూర్తయ్యాయి. రాచెరువు శుద్ధీకరణ పనులు మొదలయ్యాయి. అభివృద్ధికి చిరునామాగా మారిన బోడుప్పల్ ఇతర మున్సిపాలటీలకు  మార్గదర్శకంగా నిలిచింది. 209.2 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 30.3 కిలో మీటర్ల బీటీ రోడ్లు 90 శాతం పూర్తయ్యాయి.  స్వచ్ఛబారత్ కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేషన్ జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ఏటా  25కోట్ల వార్షిక బడ్జెట్ కొనసాగుతూ.. అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నది.

తుది దశకు డబుల్ బెడ్ ఇండ్లు

మేడ్చల్ కలెక్టరేట్ : 8 నెలల కిందట నాగారం, రాంపల్లి గ్రామాలను కలిపి నాగారం, దమ్మాయిగూడ, అహ్మద్ కుందన్ రాజీవ్ కాలనీతో కలిపి దమ్మాయిగూడ మున్సిపాలిటీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇవి అభివృద్ధికి చిరునామాగా మారాయి. మిషన్ భగీరథ కింద రూ. 40 కోట్లతో 9 ట్యాంకులు నిర్మించారు. నాగారం, దమ్మాయిగూడల్లో తొమ్మిది కిలోమీటర్ల ఫైప్ నిర్మించి రెండు రోజులకు ఒక సారి మంచినీరు అందిస్తున్నారు. దమ్మాయిగూడలో  నాగారం రిజ్వర్ ఫారెస్ట్ 75 ఎకరాల్లో ఆరోగ్య వనాన్ని అభివృద్ధి చేశారు. రాంపల్లి, అహ్మద్ ప్రభుత్వ భూమిలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. రెండు మున్సిపాలిటీలలో మిషన్ కాకతీయతో రాంపల్లి పెద్ద చెరువు, సుర్యనారాయణ చెరువు, అన్నరాయిని చెరువు, అహ్మద్ చెరువు, నాసింగ్ చెరువుల మరమ్మతు పనులతో అభివృద్ధి చేశారు. సీసీ రోడ్డు, అంతర్గత మురుగు కాలువలు కట్టించగా, మరికొన్ని పనులు మంజూరు చేశారు.

 కొత్త పుంతలు..

జవహర్ దశాబ్దాల కాలంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని జవహర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కొత్త పుంతలు తొక్కింది. రెండో విడత మిషన్ కాకతీయతో చెన్నాపురం, మల్కారం చెరువుల మరమ్మతు  పనులు పూర్తిచేశారు. మిషన్ భగీరథ పనులు కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల్లో 90 శాతం పూర్తయ్యాయి. కార్పొరేషన్ రూ. 9.32 కోట్లతో వాటర్ సంపులు నిర్మించారు. డబుల్ బెడ్ ఇండ్లను మల్కారంలోని సీఆర్ ఎదురుగా ఉన్న 15 ఎకరాల  ప్రభుత్వ స్థలంలో  27 బ్లాకులు, 1620 ఇండ్లు , అదే విధంగా దివ్యాంగుల కాలనీ సమీపంలోని సర్వే నంబర్ 829లో గల 5.5 ఎకరాల స్థలంలో 11 బ్లాకులు,  620 డబుల్ బెడ్ ఇండ్లను  మల్కారం, దివ్యాంగుల కాలనీ సమీపంలో డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జవహర్ కార్పొరేషన్ ఏర్పాటు అనంతరం భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 26 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవల రూ. 2 కోట్లు మంజూరు చేశారు. గతంలో పోలిస్తే జవహర్ అభివృద్ధిలో ముందడుగు వేసింది.

ఎంత మార్పు.. 

మేడ్చల్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం హయాంలో మేడ్చల్ మున్సిపాలిటీ అనూహ్య అభివృద్ధ్ది సాధించింది. ఆరేండ్లలో ఎన్నడూ లేని విధంగా  కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టారు. మేడ్చల్, అత్వెల్లి, కిష్టాపూర్, గిర్మాపూర్ గ్రామాలతో కలిపి మేడ్చల్ మున్సిపాలిటీ ఏర్పడింది. మున్సిపాలిటీలో మొత్తం 37,270 మంది ఓటర్లు ఉండగా , అందులో 19,846 పురుషులు,  17,422 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్ ఉన్నారు. 23 వార్డులు ఉన్న ఈ ఎన్నికల్లో 118 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.   మిషన్  భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందుతున్నది. ఈ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 43 కోట్లను మంజూరు చేయగా మేడ్చల్ మున్సిపాలిటీలో ఏండ్ల కాలంగా పడుతున్న నీటి గోస వంద శాతం తీరింది. అలాగే ఆరేండ్లలో మున్సిపాలిటీలో రూ. 16. 5 కోట్లతో సీసీ రోడ్డు నిర్మించారు. రూ 14. 2 కోట్లతో అంతర్గత మురుగు కాలవలు కట్టించారు. ప్రత్యేకంగా రూ. 85 లక్షలు వెచ్చింది డంపింగ్ యార్డును అభివృద్ధ్ది చేయడంతో పాటు రూ. 50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో 80 డబుల బెడ్ రూం ఇండ్లు సిద్ధమయ్యాయి.  మిషన్ కాకతీయ పథకం ద్వారా మేడ్చల్ పెద్ద చెరువును పునరుద్ధరణ చేపట్టారు. పట్టణానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్ నిర్మించారు.

తూంకుంట..అభివృద్ధి బాట

శామీర్ : శామీర్ మండలంలోని  తూంకుంట, అంతాయిపల్లి, ఉప్పర్ మందాయిపల్లి, పోతాయిపల్లి, దేవరయాంజాల్, సింగాయిపల్లి, హకీంపేట ప్రాంతాలను కలుపుతూ మొత్తం 40.02 స్కైర్ కిలోమీటర్ల విస్తీరంతో  24,187 జనాభా..తూంకుంట మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.  ఓటర్లు 20292 మంది ఉన్నారు.  తెలంగాణ రాష్టం ఏర్పాటు అనంతరం తూంకుంట అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కింది. కోట్ల రూపాయల వ్యయంతో  మిషన్ భగీరథ పనులు, వాటర్ ట్యాంకులు, సంపులు, వాటర్ పైప్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. రూ.9 కోట్లతో రాజీవ్ రహదారి రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. తూంకుంట పట్టణంలో సుమారు 14 ఎకరాల్లో ప్రస్తుతం 8 బ్లాకులుగా  ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు.

ఆదర్శంగా నిలుస్తూ...

బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది.కేవలం ఐదు నెలల్లోనే సుమారు ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు.   సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. పీ అండ్ టీ కాలనీల్లో సీసీ రోడ్లు, హైదర్షాకోట్ ప్రాంతంలో డ్రైనేజీ , బండ్లగూడ నుంచి కిస్మత్ వెళ్లే దారిలో సుమారు రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో  ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తున్నది బండ్లగూడ .

సమకూరిన మౌలిక వసతులు

పహాడీషరీఫ్: బడంగ్ మీర్ కార్పొరేషన్లు, జల్ తుక్కుగూడ మున్సిపాలిటీలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. మిషన్ పథకంలో భాగంగా మొదటి విడుతలో జల్ పెద్ద చెరువులో రూ. 45.5 లక్షలతో పూడికతీత కార్యక్రమం, చెరువు కట్ట బలోపేతం చేశారు. ప్రస్తుతం రూ. 8 కోట్లతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి  దర్గాపైకి ర్యాంపు ఏర్పాటుకు రూ. 9.5 కోట్లు విడుదల చేశారు. పనులు జరుగుతున్నాయి. సుమారు రూ. 7 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు జరిగాయి. మరో రూ. 7 కోట్లతో పనులు చేస్తున్నారు. రూ. 2 కోట్లతో  18 వార్ట్సు నుంచి 110 వార్డుల వరకు 6500ల ఎల్ లైట్ల ఏర్పాటు చేశారు. కాలనీ, బస్తీలలో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. బడంగ్ మీర్ కార్పొరేషన్ పరిధిలో 250 కోట్లతో మిషన్ ట్యాంకులు, పైపులైన్ పనులు చేపట్టారు. 23 కోట్లతో ట్రాంక్ నిర్మిస్తున్నారు. కోట్లాది రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. బడంగ్ కార్పొరేషన్ :2 లక్షలు(జనాభా) ,96,788(ఓటర్లు) , 32(వార్డులు) , మీర్ కార్పొరేషన్ : 1.25 లక్షలు(జనాభా), 83వేలు(ఓటర్లు), 46(వార్డులు), జల్ మున్సిపాలిటీ 1.5 లక్షలు(జనాభా),  61,833(ఓటర్లు),  28 (వార్డులు),తుక్కుగూడ మున్సిపాలిటీ  24, 442(జనాభా),  18,407(ఓటర్లు), 15(వార్డులు)  ఉన్నాయి.


logo