బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 15, 2020 , 03:07:33

గులాబీ జెండా ఎగురవేస్తాం..

గులాబీ జెండా ఎగురవేస్తాం..


ఘట్‌కేసర్‌ : మేడ్చల్‌ నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఏగురవేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మొత్తం పదింటింటికి పది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జిఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి సమావేశంలో మాట్లాడారు. పోచారంలోని 18 వార్డులకుగాను రెండు వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకున్నామన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్‌కు, బీజేపీకి అభ్యర్థులే లేరని తెలిపారు.   ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు ఉత్సహంతో ఉన్నారన్నారు. ఘట్‌కేసర్‌లో 18 వార్డు లు, పోచారంలో 18లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా మరో 16 వార్డులను గెలుచుకుంటామన్నారు. ఈ  సమావేశంలో ఎన్నికల కో- ఆర్డినేటర్‌ సర్దార్‌ పుటం పురుషోత్తంరావు, పోచారంలో మున్సిపల్‌లో ఏకగ్రీవం గా కౌన్సిలర్లుగా ఎన్నికైన బి. కొండల్‌రెడ్డి, బద్దం మమతరాణి ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌తో సమీక్ష

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన వారితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడి బుజ్జగించారు. నామినేషన్లు ఉప సంహరించేలా మంత్రి చర్యలు తీసుకున్నారు.


logo