బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 15, 2020 , 03:06:57

ఎగ్జిబిషన్‌లో సంక్రాంతి సందడి

ఎగ్జిబిషన్‌లో సంక్రాంతి సందడి


అబిడ్స్‌,నమస్తే తెలంగాణ:నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో సందర్శకులు సందడి చేశారు. నగర నలు మూలల నుంచి వేలాది మంది సందర్శకులు తరలివచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో మంగళవారం దాదాపు డబ్బు వేలపై చిలుకు సందర్శకులు తరలివచ్చారు. దీంతో ఇప్పటి వరకు సందర్శకుల సంఖ్య మూడు లక్షలు దాటింది. సాయంత్రం నుంచే సందర్శకులు ఎగ్జిబిషన్‌ మైదానానికి భారీగా తరలి వచ్చారు. దీంతో మైదానంలోని దుకాణాలు సందర్శకులతో కిటకిటలాడాయి.ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాద్యక్షులు సురేందర్‌, కార్యదర్శి డాక్టర్‌ ప్రభాశంకర్‌, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు,కోశాధికారి వినయ్‌కుమార్‌లతో పాటు సభ్యులు మైదానంలో తిరిగి పర్యవేక్షించారు. 


logo