గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 13, 2020 , 02:08:37

మహిళా రక్షణకు భద్రతా కవచం

మహిళా రక్షణకు భద్రతా కవచం
  • -13 మార్గాల్లో పటిష్ట చర్యలు
  • -1000 మంది షీ ఫర్‌ హర్‌ వలంటీర్లు
  • -షీ టీమ్స్‌తో భద్రత
  • -ఆత్మరక్షణ కోసం మెళకువలు
  • -సురక్షిత ప్రయాణానికి..మై ఆటో, కార్‌ ఈజ్‌ సేఫ్‌ స్టిక్కర్లు
  • -‘రాచకొండ’ పరిధిలో అమలు

(గొట్టిముక్కుల సుధాకర్‌ గౌడ్‌): సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆమెకు అండగా దేశంలో మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఆవిష్కరించిన షీ టీమ్స్‌ సేవ లతో ఇప్పుడు ప్రతి మహిళ ఐ యామ్‌ సేఫ్‌ అని గుండె ధైర్యం గా చెప్పుతుంది.  ఆడవాళ్ల జోలికి వచ్చే పోకిరీలు, తాగుబోతు భర్తలు, కామాంధులు, కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు పాల్పడే ఉన్నత స్థాయి ఉద్యోగులు ఇలా ఎక్కడైనా ఆమెకు అభద్రత భావం లేకుండా షీ టీమ్స్‌ వీరందర్నీ కట్టడి చేసింది. కౌన్సెలింగ్‌తో మార్చేందుకు ప్రయత్నించి ఆ తర్వాత మార్పు రాకపోతే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తుంది. ఆమెకు అవసరమైతే షీ టీమ్స్‌ సేవలను వారి వద్దకే అందేలా షీ ఫర్‌ హర్‌లను బలోపేతం చేశారు. మార్గదర్శక్‌ ప్రతినిధులతో ఐటీ సెక్టార్‌లో వైట్‌కాలర్‌లో ఉండే కామాంధులను అరికడుతున్నారు.  తప్పు లు చేసిన మైనర్లను వారి కుటుంబ సభ్యుల ముందు కౌన్సెలింగ్‌ చేసి మార్పు తీసుకువస్తున్నారు. మహళల రక్షణ కోసం 13 పద్ధతుల్లో రాచకొండ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అడ్డంగా దొరికిన 493 మంది ఈవ్‌టీజర్లు...

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాదిలో ఈ అంశానికి సంబంధించి మొత్తం 450 కేసులు నమోదయ్యాయి. వీటిలో 493 మందిని అరెస్టు చేశారు. అందులో 202 ఫిర్యాదు లపై ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులను నమోదు కాగా 192 పెట్టీ కేసులను పెట్టారు. 56 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించి మరో సారి తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చ రించారు. 111 మంది మైనర్లు, 382 మంది మేజ ర్లు అరెస్ట్‌ అయ్యారు. 

బాల్యం  ఛిద్రం కాకుండా...

ఈ ఏడాది రాచకొండ షీ టీమ్స్‌ మొత్తం 24 బాల్య వివాహా లను ఆపాయి. బాధిత బాలికలు షీ టీమ్స్‌కు హ్యాట్సాఫ్‌ అంటు న్నారు.  భువనగిరి, చౌటుప్పల్‌, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి ప్రాంతాల్లో  బాల్య వివాహాలను అరికట్టి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

యువతికి భరోసాగా మరో షీ సైన్యం

కాలేజీ, కళాశాలలో పోకిరీల వెకిలి చేష్టలతో పాటు మోసపూ రితమైన వ్యవహారాల నుంచి విద్యార్థినిలకు అండగా ఉండేం దుకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ 1000 మంది షీ ఫర్‌ హార్‌ సైన్యాన్ని తయారు చేశారు.దీంతో విద్యార్ధిని లు ఎలాంటి అవమానం, అపోహలు, పరువు పోతుందనే భయాన్ని వీడి షీ ఫర్‌ హర్‌ ప్రతినిధులను నిర్మోహటంగా ఆశ్రయిస్తున్నారు. గత సంవత్సరం షీ ఫర్‌ హార్‌ ప్రతినిధులను ఐదుగురు విద్యార్థినిలు ఆశ్రయించి వేధింపులకు పాల్పడ్డ పోకీరీ ల ఆట కట్టించారు.

సదస్సులతో చైతన్యం...

రాచకొండ షీ టీమ్స్‌ మొత్తం 1124 అవగాహన సదస్సులు, కార్యక్రమాలను నిర్వహించి దాదాపు 274550 మంది మహి ళలు, విద్యార్థినిలకు చట్టాలు, హక్కుల గురించి వివరించి వారి ని చైతన్యపర్చారు. అంతేకాకుండా ఆపదలో ఉన్నప్పుడు ఎలా తప్పించుకోవాలని మెళకువలను నేర్పించారు. వారికి  ధైర్యంగా పోరాడే స్ఫూర్తినిచ్చారు.ఫిర్యాదు వచ్చినప్పుడే కాదు ఆ ఫిర్యాదు రాకుండా షీ టీమ్స్‌ పోకిరీలను నీడలా వెంటాడాయి. దీని కోసం కాలేజీలు, కళా శా లలు, బస్సు స్టాప్‌లు, పని చేసే కార్యాలయాల వద్ద, మెట్రో రైలు, సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ వద్ద మాటు వేసి పోకిరీల చేష్టలను ఆధారాలతో చిత్రీకరించి వారి భరతం పట్టారు.

సురక్షిత ప్రయాణం కోసం...

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఐటీ సెక్టార్‌లో పని చేసే మహిళ ఉద్యోగినిలకు సురక్షితమైన ప్రయాణం కోసం షీ షటీల్‌ సర్వీసులను ప్రారంభించారు. ప్రస్తుతం రెండు షీ షటీల్‌ బస్సులు నడుస్తున్నాయి.  ఈ బస్సులలో రీచ్‌ సేఫ్‌ యా ప్‌.... మహిళా సెక్యురిటీగార్డు, ఆపదలో ఉన్నప్పుడు స్మార్ట్‌ యాప్‌ లో పానిక్‌ బటన్‌ సౌకర్యాన్ని ఈ బస్సులో ఏర్పాటు చేశారు.

ఉద్యోగంలో బాసులు వేధించినా...

కార్పొరేట్‌ సెక్టార్‌లో మహిళ ఉద్యోగినిలకు అండగా ఉండేం దుకు సీపీ మహేష్‌ భగవత్‌ మార్గదర్శక్‌ పేరుతో ప్రతినిధులను ఏర్పాటు చేశారు. కార్యాలయాల్లో జరిగే వేధింపుల  బాధితు లకు షీ టీమ్స్‌కు వారధిగా ఈ ప్రతినిధులు నిలబడతారు. దీం తో ఇప్పుడు పోలీసుల వద్దకు వెళ్ళితే ఎక్కడ ఉద్యోగం ఊడు తుందో అనే అపోహలో ఉండే మహిళ ఉద్యోగినిలు ఇప్పుడు మార్గదర్శక్‌లను ఆశ్రయిస్తూ వారి వద్దకే షీ టీమ్స్‌ సేవలను అందిస్తున్నారు.మహిళలు, విద్యార్ధులు, బాలికలను వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించడం కన్నా వారిలో మార్పు తీసు కురావడానికి షీ టీమ్స్‌ ప్రయత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగా స్వచ్ఛంద సంస్థ భూమిక కలెక్టివ్‌ తో కలిసి రాచకొండ షీ టీమ్స్‌ పోకిరీలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాయి.

ఆడ శిశువు గర్భంలో హత్యకు గురికాకుండా

ఆడపిల్ల భారం అనుకుని కొందరు, మోసానికి గురై గర్భం దాల్చిన బాధితులు ఆ పిండాన్ని తొలగించాలనుకుని వైద్యుల ను ఆశ్రయిస్తారు. చట్టపరంగా అలా చేయడం అక్రమమేనని తెలిసి కూడా కొంత మంది వైద్యులు డబ్బులకు ఆశపడి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు లింగనిర్ధారణ చేస్తూ ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని ఆ శిశువును గర్భంలో చంపేయాలనుకున్న వారికి సహకరిస్తున్న వారి కోసం షీ టీమ్స్‌ ప్రత్యేకంగా డీకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఇలా ఆడ శిశువును గర్భంలోనే చంపేయడానికి సహకరించిన ముగ్గురు ఎంబీబీఎస్‌ వైద్యులను రాచకొండ షీ టీమ్స్‌ అరెస్టు చేశాయి. మూడు మల్టీ స్పెషాల్టీ దవాఖానాలపై చర్యలు తీసుకున్నారు.
 

136 హాస్టల్స్‌లో  ఆకస్మిక తనిఖీ

ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాల నుంచి వచ్చి రాచకొండ పరిధిలో నివాసం ఉంటూ ఉద్యోగం, విద్యను అభ్యసిస్తున్న వారు హాస్టల్స్‌లో ఉంటారు.వారి భద్రత కోసం స్టే సేఫ్‌ కార్య క్రమాన్ని పోలీసు నిర్వహిస్తున్నారు. ఇలా136 హాస్టల్స్‌లలో షీ టీమ్స్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న రక్షణ చర్యలపై సమీక్షించారు. ఈ హాస్టల్స్‌లో రికార్డుల సరిగా నిర్వహించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అందులో ఉంటున్న వా రందరీ ధృవీకరణ పత్రాలను సేకరించుకుని ప్రత్యేక డాటాను నిర్వహించేలా నిర్వాహకులు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వేసవి శిక్షణ శిబిరంలో షీ టీమ్స్‌ 800 మంది బాలబాలికలకు మహిళపై జరిగే నేరాలు, వారికి ఉన్న హక్కులు, చట్టాలు, సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌ పై అవగాహనను కల్పించాయి. చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా వారికి దగ్గరయ్యారు.

మై ఆటో / మై క్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌ ...

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మై ఆటో / మై క్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌ పేరుతో  స్టికర్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఈ స్టికర్‌ ఉన్న ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణీస్తే సురక్షితమనే నమ్మకాన్ని తీసుకువచ్చారు. దాదాపు 10 వేలకు పైగా ఆటోలు, కార్లు ఈ స్టికర్‌లతో ఇప్పుడు తిరుగుతున్నాయి. ఈ స్టికర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని వివరాలను తెలిసిన వారికి, ట్రాఫిక్‌ అధికారులు  మెసేజ్‌ చేస్తే చాలు వారి ప్రయాణం పూర్తి భద్రత మధ్య కొనసాగుతుంది. ఆ స్టికర్‌ ఆధారంగా కారు ఎవరిది, డ్రైవర్‌ పేరు, ఆచూకీ, ఫోన్‌ నెంబర్లు ఇలా అన్ని వివరాలు ఒక క్లిక్‌తో తెలిసిపోతుంది. దీంతో ప్రయాణంలో ఎలాంటి అభద్రత ఉండదు.

రాచకొండ షీ టీమ్స్‌ సేవలు కావాలంటే....

వాట్సాప్‌ నెంబరు-9490617111
డయల్‌-100
మెయిల్‌ఐడీ sheteamrachakonda<\@>gmail.com
ట్విటర్‌-https://twitter.com/she teamrck1
ఫేసుబుక్‌-https://www.facebook.com/sheteamsrck/
పోలీసు స్టేషన్‌లలో ఉమెన్స్‌ హెల్ప్‌ డెస్క్‌ ద్వారా షీ టీమ్స్‌ ను సంప్రదించవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.

ధైర్యంగా ఫిర్యాదు చేయండి

మహిళల భద్రతకు రాజీలేదు. వారికి నిరంతరంగా పోలీసు సేవలు అందుతాయి. షీ ఫర్‌ హార్‌, మార్గదర్శక్‌లు కాలేజీలు, కళాశాలలో, కార్పొరేట్‌ రంగంలో పూర్తి స్వేచ్ఛా వాతావరణం అందుతుంది.  రాత్రి వేళ్లలో కూడా మహిళలు సురక్షితంగా ప్రయాణించేందుకు మై ఆటో... క్యాబ్‌ ఈజ్‌ సేఫ్‌ను తప్పనిసరిగా అమలు చేస్తున్నాం.  మహిళలు, యువతులు, విద్యార్ధినిలు భయపడొద్దు. ధైర్యంగా ఆకతాయిలపై ఫిర్యాదు చేయాలి. 25 ప్రభుత్వ పాఠశాలలో స్టూ డెంట్‌ క్యాడెట్‌ కాప్స్‌కు ప్రత్యేక మార్షల్‌ ఆర్ట్‌ శిక్షణ ఇస్తు న్నాం. రాచకొండ సోసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ద్వారా ప్రత్యేకంగా మహిళ విభాగం ప్రారంభించి ఐటీ సెక్టార్‌లో మహిళ ఉద్యోగినిల భద్రతను మరింత పటిష్టం చేస్తాం.ఈవ్‌ టీజింగ్‌, మహిళలపై అఘాత్యాల సంఘటనలో నిందితులకు శిక్ష పక్కాగా వచ్చేలా  దర్యాప్తు సాగుతుంది.
-మహేష్‌భగవత్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌


logo