ఆదివారం 24 మే 2020
Hyderabad-city - Jan 13, 2020 , 02:06:05

భాగ్యనగరంలో ‘సంక్రాంతి’ ఎగ్జిబిషన్లు..!

భాగ్యనగరంలో ‘సంక్రాంతి’ ఎగ్జిబిషన్లు..!
  • -హునార్‌ హాట్‌, నుమాయిష్‌లో సందడే సందడి
  • -దేశీయ ఉత్పత్తుల విక్రయానికి కేంద్రంగా గ్రేటర్‌
  • -ఎగ్జిబిషన్‌ ఏదైనా పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారుల ప్రత్యేక ఆసక్తి
  • -నగరవాసుల వద్దకే సకల వస్తువులు
  • -పండుగ కొనుగోళ్లతో బిజీబిజీ
  • -నేటి నుంచి స్వీట్‌, కైట్‌ ఫెస్టివల్‌ షురూ

భాగ్యనగరంలో సంక్రాంతి సందడి షురూ అయింది. ఎగ్జిబిషన్ల కోలాహలంతో నగరం సరికొత్త శోభను సంతరించుకుంది.. ఇప్పటికే నాంపల్లిలో నుమాయిష్‌.. పీపుల్‌ ప్లాజాలోని హునార్‌హాట్‌ నగరవాసులకు ఆతిథ్యంతోపాటు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎగ్జిబిషన్లకు వెళ్లి సరదాగా గడుపుతున్నారు. అదిరిపోయే దేశీ వంటకాలను రుచి చూస్తున్నారు. ఆటబొమ్మల నుంచి అలంకరణ వస్తువుల వరకు విక్రయానికి ఉండటంతో నగరవాసులు పం డుగ షాపింగ్‌లు
చేస్తున్నారు. మరోవైపు నేటి నుంచి కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ ప్రారం భం కానుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా కైట్‌, స్వీట్‌ ఫెస్ట్‌వెల్‌ను వైభవంగా నిర్వహిస్తుం డడం హార్షణీయమని కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షు డు రామకృష్ణ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్ల పనులకు ఆయన పరీశీలించారు. మొత్తంగా సంక్రాంతి ఎగ్జిబిషన్లు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా పలు వ్యాపారులు తమ ఉత్పత్తులను భాగ్యనగరంలో విక్రయించడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.

ఆహ్లాదకరంగా హునార్‌ హాట్‌!!

నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శా ఖ ఆధ్వర్యంలో ‘హస్తకళలు, వంటకాల సంగమం(హునార్‌ హాట్‌)’ కొలువుదీరింది. ఈనెల 11 నుంచి 19 వరకు హునార్‌ హాట్‌ ఉంటుంది. సుమారు 130 స్టాళ్లకుపైగా ఉన్నాయి. షాపింగ్‌ చేయడానికి అనువుగా తీర్చిదిద్దారు. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి సందడి చేసుకునే విధంగా హునా ర్‌ హాట్‌ను ఏర్పాటు చేశారు. గంగిరెద్దులు, ఏనుగుబొమ్మ, కచ్చురం, రైలుబండి తదితర వాటిని ఏర్పాటు చేయడంతో కుటుంబసమేతంగా సందడిగా గడుపుతున్నారు. సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11గంటల నుంచి రాత్రి 10:30 వరకు హునార్‌ హాట్‌ను సందర్శించవచ్చు. ముఖ్యంగా చిన్నారులను హునార్‌హాట్‌ ఎంతగానో ఆకర్షిస్తుంది. సెల్ఫీలతో నగరవాసులు సందడి చేస్తున్నారు.

రుచి చూద్దాం.. షాపింగ్‌ చేద్దాం..!!

దేశంలో పలు రాష్ర్టాల్లో అత్యంత ప్రజాధారణ పొందిన ఫేమస్‌ ఫుడ్‌ హునార్‌హా

ట్‌లో అందుబాటులో ఉంది. ఇతర రాష్ర్టాల ఆహారపదార్థాల రుచులు చూడటాని కి ఆయా రాష్ర్టాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..హునార్‌కు వెళితే సరిపోతుంది. అక్కడికక్కడే తయారీ చేసి..మనకునచ్చిన వంటకాలను అందిస్తారు. ముఖ్యంగా నాన్‌వెజ్‌ బిర్యానీల ఘుమఘుమలు అదిరిపోతున్నాయి. చట్నీలు, స్వీట్లు, స్పెషల్‌ మట్టి గ్లాస్‌లో ఛాయ్‌..పండ్ల రసాలు..రాజస్తాన్‌ పానీపూరీ, గృహతయారీ లడ్డూలు.. మొత్తం గా ఆహారపదార్థాలన్నీ ఒకే చోట కనిపించి నోరూరిస్తున్నాయని సందర్శకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఫుడ్‌ను టేస్ట్‌ చేయాలంటే కొంచం ఖరీదైన తినాల్సిందేనని తెలిపారు. మరోవైపు ఇంటి అలంకరణ వస్తువులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మెటల్‌తో తయారు చేసిన క్రాఫ్ట్స్‌ విక్రయిస్తున్నారు. గడియారం, బైక్‌, ట్రీ, వాయిద్యాల పరికరాలను మెటల్‌తో అందంగా తీర్చిదిద్ది.. ఇంటి అలంకరణ వస్తువులుగా మలిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఈ తరహా వస్తువులు విక్రయానికి ఉన్నాయి. ఫ్లవర్స్‌ డెకర్స్‌, డ్రై ఫ్లవర్స్‌, ఆకర్షింతే పూజా సామగ్రి, చత్తీస్‌ఘర్‌ నుంచి బాంబూ క్రాఫ్ట్స్‌, అస్సాం నుంచి జూట్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

హునార్‌లో అత్తర్‌..!!

సందర్శకులు అత్తర్‌ అద్దుతున్నారు. హునార్‌లో సువాసన గుప్పుమంటోంది. ఢిల్లీ నుంచి పలు రకాల సువాసనలు వెదజల్లే లేపనాలను నగరానికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గులాబీ, మల్లె, రుహ్‌కూస్‌ వాసనలు వెదజల్లే వాటిని సందర్శకులు విక్రయిస్తున్నారు. అత్యంత ఖరీదైన ఊడ్‌ సెంట్‌ కూడా అందుబాటులో ఉందని స్టాల్‌ నిర్వాహకుడు తెలిపారు. సీజన్‌కు తగ్గ సెంట్‌ను తయారు చేస్తామని సమ్మర్‌లో రుకూస్‌, వింటర్‌లో శమమ సెంట్లు ఉపయోగిస్తే బాగుంటుందని తెలిపారు. మొటియ, బెల, జఫ్రానీ రోస్‌, సాండల్‌ వుడ్‌, జన్నటుల్‌ ఫిర్దౌస్‌, మ జ్మువ, గెలాక్సీ, బ్లూ ఐస్‌ సెంట్‌ బాటిళ్లు ప్రత్యేకంగా విక్రయానికి ఉంచారు.

నుమాయిష్‌లో అదే జోరు..!

నాంపల్లిలో జనవరి 1నుంచి ప్రారంభమైన నుమాయిష్‌ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో కూడా అన్ని రకాల షాపింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్‌  అందుబాటులో ఉండనుంది. మరో అంతర్జాతీయ కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ నేటి నుంచి ప్రారంభంకానుంది. ముఖ్యంగా స్వీట్స్‌ పండుగ.. నగరవాసులకు సరికొత్త రుచులను అందించనుంది. గుజరాతీ, రాజస్తాన్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం, ఢిల్లీ, ముంబై రాష్ట్రల్లో నోరూరించే స్వీట్లు అన్నీ సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో అందుబాటులో ఉంటాయి. ఓ వైపు కైట్‌ ఫెస్టివల్‌..మరోవైపు స్వీట్‌ ఫెస్టివల్‌ నగరవాసులకు సంక్రాంతి సందడిని రెట్టింపు అందించనున్నాయి. మొత్తంగా నగరంలో జరుగుతున్న పలు రకాల ఎగ్జిబిషన్లు హైదరాబాద్‌ పేరును విశ్వవ్యాప్తం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

హైదరాబాదీల నుంచి మంచి స్పందన ఉంది

మేము ఇదే మొదటిసారి నగరానికి రావడం. హైదరాబాదీల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా కేరళ ఆహారపదార్థాలను బాగా ఇష్టపడుతున్నారు. వారి కోసం మేమే స్వయంగా తయారు చేసి అందిస్తున్నాం. ముఖ్యంగా కేరళలో ఫేమస్‌ చట్నీ కల్లుమకాయ చట్నీని ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
- అల్విన్‌, కేరళ

నాన్‌వెజ్‌లో వెరైటీలను బాగా ఇష్టపడుతున్నారు

నాన్‌వెజ్‌లో వెరైటీలను నగరవాసు లు బాగా ఇష్టపడుతున్నారు. వారి కోసం పశ్చిమ బెంగాల్‌ రుచులను అం దుబాటులో ఉంచాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వాలకు ధన్యవాదా లు. వ్యాపారులను ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకోవడం మంచి విష యం. నగరవాసులు ముఖ్యంగా రోయ్యల ఫ్రైని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
-ఎస్‌కే భట్‌, పశ్చిమ బెంగాల్‌


logo