సోమవారం 30 మార్చి 2020
Hyderabad-city - Jan 09, 2020 , 18:00:09

విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా..

విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా..

-ఇద్దరు యువకులు అరెస్ట్‌.. 22 కిలోలు స్వాధీనం
ఆర్కేపురం : గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. ఎకత్సుజ్‌ సీఐ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం... విశాఖప ట్నంకు చెందిన కొర్రగాసి, ప్రకాం జిల్లాకు చెందిన విష్ణు వర్ధన్‌ విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌, షిర్డీలో విక్రయిస్తున్నారు. అలాగే ఆన్‌లైన్లో కూడా విక్రయించడానికి పథ కం పన్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీ సులు బుధవారం ఎల్బీనగర్‌లో వారిని పట్టుకున్నారు. వారి నుం చి 22 కిలోల ఎండు గంజాయి, రెండు సెల్‌ ఫోన్లు, రూ.2500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఇన్‌స్పె క్టర్స్‌ ఎస్‌.కల్పన, ఎం.డి.జియావుద్దీన్‌, ఎక్సైజ్‌ ఎస్‌ఐలు కూర్మనాయకులు, సుతారి, సిబ్బంది పాల్గొన్నారు.


logo