బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 09, 2020 , 17:59:11

ఎంటర్‌ప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌ను సృష్టించడంపై ‘టాస్క్‌' దృష్టి

ఎంటర్‌ప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌ను సృష్టించడంపై ‘టాస్క్‌' దృష్టి

ఘట్‌కేసర్‌: రాష్ట్రంలోని యువతలో ఎంటర్‌ప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌ను రుపొందించడానికి టాస్క్‌ కృషి చేస్తుందని సంస్థ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌ అనురాగ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నాలుగు రోజుల పాటు జరిగిన ఏడో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇంజినీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ముగింపు సమావేశం బుధవారం జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 676 కళాశాలల్లో లక్షా 84 వేల 689 మంది విద్యార్థులు టాస్క్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. తమ సంస్థ ద్వారా విద్యార్థులకు వివిధ కోణాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 5701 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చామన్నారు. పరిశ్రమకు అవసరమయ్యే ప్రతిభకు, ఇంజినీరింగ్‌ కళాశాలలు అందిస్తున్న ప్రతిభకు మధ్య చాలా అంతరం ఉం దన్నారు. విద్యార్థులను పరిశ్రమకు అవసరమయ్యే విధంగా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ముగింపు సమావేశంలో కళాశాల సెక్రటరీ పల్లా నీలిమా, కళాశాల డైరక్టర్‌ కేఎస్‌.రావు, జెన్‌ప్యాక్‌ ప్రతినిధి ఎల్‌.రామకృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


logo