గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 09, 2020 , 17:58:43

‘పరిశోధన ఫలాలు సామాన్యులకు చేరాలి’

‘పరిశోధన ఫలాలు సామాన్యులకు చేరాలి’

ఉస్మానియా యూనివర్సిటీ: అన్నిరంగాల్లో జరిగే పరిశోధన ఫలాలు సామాన్యులకు చేరాలని, అప్పుడే వాటికి సార్థకత ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌) ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ.రామకుమార్‌ అన్నారు. పరిశోధనల ద్వారా సామాన్యులకు అవసరమైన ఉత్పత్తులను తక్కువ ధరకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఓయూ టెక్నాలజీ కళాశా ల కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ‘రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఇన్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌(రేస్‌)-2020’పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీర్స్‌-హైదరాబాద్‌ రీజనల్‌ సెంటర్‌ సహకారంతో కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రారంభోత్సవానికి డాక్టర్‌ ఎస్‌ఎస్‌వీ రామకుమార్‌ హాజరయ్యా రు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్‌ ఇంజినీర్స్‌ పరిశోధనలవైపు దృష్టి సారించాలన్నారు. టూత్‌పేస్ట్‌, బ్రష్‌ మొదలైన నిత్యావసర వస్తువులు అన్నీ కెమికల్‌ ఇంజినీర్లు తయారుచేసినవేనని గుర్తు చేశారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల వైపు కాకుండా నూతన పరిశ్రమలను ప్రారంభించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఐఎంఎంటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుధాసత్వ బసు, కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శ్యాంసుందర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌కుమార్‌, సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వీవీ.బసవరావు, కోకన్వీనర్లు డాక్టర్‌ సం జయ్‌భరద్వాజ్‌, ఐలయ్య, కళాశాల గవర్నింగ్‌ బోర్డు చైర్మ న్‌ సత్యపాల్‌, ప్రొఫెసర్లు హయవదన, కవితావాఘ్రే, రవీంద్రనాథ్‌, శ్రీను నాయ క్‌, రాజం తదితరులతోపాటు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి రిసోర్స్‌పర్సన్స్‌, ప్రతినిధులు పాల్గొన్నారు.


logo
>>>>>>