గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad-city - Jan 09, 2020 , 17:58:08

ఉన్నతాశయంతో విద్యాభ్యాసం చేయాలి

ఉన్నతాశయంతో విద్యాభ్యాసం చేయాలి

మెహిదీపట్నం: జీవితంలో ఉన్నతాశయంతో విద్యార్థినులు చదువు కోవాలని, ప్రతీ రంగంలో మహిళలు రాణించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. బుధవారం మెహిదీపట్నం సెయింట్‌ ఆన్స్‌ డిగ్రీ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్న ఆశయాలతో ప్రతిఒక్కరూ పట్టుదలతో చదువుకోవాలన్నారు. అదేవిధంగా విద్యతోపాటు ఇతర రంగాల్లో రాణించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వైస్‌చైర్మన్‌ వెంకటరమణ, సెయింట్‌ ఆన్స్‌ హైదరాబాద్‌ ప్రావిన్స్‌ సుపీరియర్‌ డాక్టర్‌ ఇగ్నిషియస్‌ సుమన్‌, ఉస్మానియా యూనివర్సిట్‌ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరాంవెంకటేశ్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.అమృత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు డిగ్రీలు, గోల్డ్‌ మెడల్స్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అందచేశారు.


logo