మంగళవారం 31 మార్చి 2020
Horoscope - Mar 03, 2020 , 06:17:20

మంగళవారం 3 మార్చి 2020.. మీ రాశి ఫలాలు

మంగళవారం  3 మార్చి 2020.. మీ రాశి ఫలాలు

మేషరాశి : ఈ రోజు ఎక్కువ సమయం ఏ పని చేయకుండా బద్ధకంగా గడుపుతారు. అనుకున్న పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరుల వ్యవహారాల్లో ఓపిక అవసరం. గృహ సంబంధ లావాదేవీల్లో తొందరపాటు పనికిరాదు.

వృషభం :  ఈ రోజు ఎక్కువ సమయం ఉల్లాసంగా గడుపుతారు. ఎక్కువ సమయం వ్యక్తిగత పనులకు కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులను కలుస్తారు.

మిథునం : కొత్త పనులు ప్రారంభించడానికి అంతగా అనుకూలమైన రోజు కాదు. చేపట్టిన పనులు కూడా మధ్యలో మానేయడం.. వాయిదా వేయడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. తొందరపడి మాట జారడం, తర్వాత బాధపడడం జరుగుతుంది.

కర్కాటకం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు, ఒప్పందాలు పూర్తి చేస్తారు. పెట్టుబడుల్లో అజాగ్రత్త, తొందరపాటు పనికిరాదు. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ మీ శత్రువుల విషయంలో అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. వారిపై ఒక కన్నేసి ఉంచండి.

సింహం : ఈ రోజు చేపట్టిన పనులు శ్రమతో పూర్తి చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి అధికంగా ఉండడం కారణంగా అలసట, నిస్సత్తువకు  అవకాశం ఉంటుంది. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలించే రోజు కాదు.

కన్య :  మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. చాలాకాలం నుంచి వాయిదా పడుతున్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు.

తుల : ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వృత్తిపరంగా ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.

వృశ్చికం : ఈ రోజు మీ వృత్తి విషయంలో అనుకూలమైన మార్పు చోటు చేసుకోవడం, అనుకూలమైన వార్త వినడం జరుగుతుంది. విదేశీ సంబంధ వ్యవహారాలు పూర్తవుతాయి. గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశముంటుంది.

ధనుస్సు : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులు మీ జీవిత భాగస్వామి సహాయంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. రక్తం లేదా ఉదర సంబంధ అనారోగ్యాల కారణంగా ఇబ్బందిపడే అవకాశముంటుంది.

మకరం  :  ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వారితో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ ప్రేమను వ్యక్తం చేయగలుగుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. మీ సృజనాత్మకత ప్రశంసలు పొందుతుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కుంభం :  ఈ రోజు ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిదికాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినడం లేదా ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.

మీనం :  ఈ రోజు ప్రయాణాలకు, నూతన మార్పులకు, వాహన కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రశంసలు లభిస్తాయి.


logo
>>>>>>