గురువారం 02 ఏప్రిల్ 2020
Horoscope - Feb 01, 2020 , 06:06:37

1 ఫిబ్రవరి,1 2020 శనివారం.. మీ రాశిఫలాలు

1 ఫిబ్రవరి,1 2020 శనివారం.. మీ రాశిఫలాలు

మేష రాశి :  ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. 


వృషభం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా చూసుకోండి. 


మిథునం :  ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సాయం అందటం జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలోఅనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.


కర్కాటకం :   ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్తిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పైఅధికారులను కలవడానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


సింహం : ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.


కన్య :  ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. 


తుల :  ఈ రోజు నూతన వ్యాపార ఒప్పందాలు కానీ, ఆర్థిక లావాదేవీలు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహనం కొనడం కానీ, మరమ్మతుచేయించడం చేస్తారు. నూతన వస్త్ర భరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తిలో అనుకూల పరిణామాలు ఏర్పడతాయి.


వృశ్చికం : ఈ రోజు మీ వృత్తిలో అనుకోని మార్పు చోటు చేసుకుంటుంది. మీరు ఎదురు చూస్తున్న పదోన్నతికానీ, పదవిలో మార్పుకానీ చోటుచేసుకుంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతాయి. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి.


ధనుస్సు :  ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. మీ సంతానం లేదా మీకు ఇష్టమైన వారి ఆరోగ్య పరిస్థితి మీ ఆందోళనకు కారణమవుతుంది. మీరు పూర్తి చేస్తానన్న పనులు పూర్తి చేయకపోవడం వల్ల మీ పైఅధికారులు మీపై అసహనం వ్యక్తం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో అనుకోని మనస్పర్థలు ఏర్పడవచ్చు. 


మకరం :   ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడటం కారణంగా మానసిక అశాంతికి, ఆవేశానికి గురవుతారు. అనుకోని ఖర్చులు కానీ, నష్టాలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఎక్కువ ఆవేశానికి లోను కాకుండా స్థిమితంగా ఆలోచించడం వల్ల సమస్యల నుంచి బయటపడ గలుగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.


కుంభం :  ఈ రోజు మీ వృత్తిలో మార్పు కానీ, అనుకోని ప్రయాణం  చోటు చేసుకుంటుంది. ఇతరుల బాధ్యతలను, పనిని మీరు చేయవలసి రావచ్చు. మీ పట్టుదలతో దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగులతో మెలిగేటప్పుడు జాగ్రత్త అవసరం, మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఆర్థికంగా సామాన్యం గా ఉంటుంది.


మీనం :  ఈ రోజు మాట విషయంలో, ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్ర త్త అవసరం. అనవసర వాదనల వల్ల మీగౌరవానికి భంగం కలిగే ప్రమాదముంటుంది.  మానసికంగా స్థిరంగా ఉండటం, మీపై మీరు నమ్మకాన్ని కోల్పొకుండా ఉండటం వల్ల అన్ని విషయాల్లో ఇబ్బందుల నుంచి బయట పడగలుగుతారు.


logo
>>>>>>