సోమవారం 28 సెప్టెంబర్ 2020
Horoscope - Aug 01, 2020 , 03:31:01

క్రీడా అవార్డుల కమిటీలో సెహ్వాగ్‌

క్రీడా అవార్డుల కమిటీలో సెహ్వాగ్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక కమిటీలో టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ దిగ్గజం సర్దార్‌ సింగ్‌కు చోటు దక్కింది. అవార్డుల కోసం అర్హులను ఎంపిక చేసేందుకు 12 మంది సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ముకుందమ్‌ శర్మ చైర్మన్‌గా ఉన్నారు.  గతేడాదిలాగే ఈసారి కూడా ఒకే సెలెక్షన్‌ కమిటీ ఏర్పాటైంది. పారాలింపిక్‌ రజత పతక విజేత దీపామాలిక్‌, టేబుల్‌ టెన్నిస్‌ మాజీ ప్లేయర్‌ మోనాలిసా బరువా మెహతా, బాక్సర్‌ వెంకటేశన్‌ దేవరాజన్‌, స్పోర్ట్స్‌ కామెంటేటర్‌ మనీష్‌ బతావియా, సోర్ట్స్‌ జర్నలిస్టులు అలోక్‌ సిన్హా, నీరూ భాటియా ఎంపిక కమిటీలో చోటు దక్కించుకున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున సాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రధాన్‌, సంయుక్త కార్యదర్శి(క్రీడా అభివృద్ధి) ఎల్‌ఎస్‌ సింగ్‌, టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీం(టాప్స్‌) సీఈవో రాజేశ్‌ రాజగోపాలన్‌ కమిటీలో ఉన్నారు. 


logo